బాబు గోగినేనికి కౌశల్ సవాల్!

Edari Rama Krishna
బుల్లితెరపై వచ్చిన బిగ్ బాస్ సీజన్ 2 మొదటి నుంచి ఎన్నో రకాల వివాదాలతో నడుస్తూ వచ్చింది.  ఈ సీజన్ లో  పదిహేడు మంది ఇంటి సభ్యులు రాగా..అందులో ముగ్గురు కామన్ మాన్ గా ఎంట్రీ ఇచ్చారు.   గణేష్, సంజన, నూతన్ నాయుడు కామన్ మాన్ గా ఎంట్రీ ఇచ్చినా..మొదటి వారమే సంజన ఎలిమినేట్ అయ్యింది. దాంతో సెలబ్రెటీలకు పెద్ద పీట వేస్తున్నారన్న టాక్ వినిపించింది.  ఆ తర్వాత నూతన్ నాయుడు ఎలిమినేట్ కావడంతో నిజంగా బిగ్ బాస్ హౌజ్ లో కామన్ మాన్ ని పేరుకే పెట్టుకున్నారని టాక్ వినిపించింది. 

అయితే గనేష్ మాత్రం డెబ్బై రోజుల వరకు కంటిన్యూ అయ్యాడు.  ఇక నూతన్ నాయుడు రెండో సారి ఓటింగ్ పద్దతి ద్వారా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇదిలా ఉంటే..బిగ్ బాస్ సీజన్ 2 లో కి ఎంట్రీ ఇచ్చిన కౌశల్ కి బయట కౌశల్ ఆర్మీ అంటూ ఫ్యాన్స్ ఏర్పడటం..ప్రతిసారి ఓటింగ్ తో కౌశల్ ని సేవ్ చేయడం జరిగింది. బిగ్ బాస్ హౌజ్ లో మొదటి నుంచి కౌశల్ పై అందరూ రక రకాల కామెంట్స్ చేయడం..దూరంగా ఉంచడం..సూటి పోటి మాటలు అనడం..టాస్క్ లో ఒంటరిని చేయడం ఇలా ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేసిన విషయం తెలిసిందే. 

బాబు గోగినేని అయితే ఏకంగా కౌశల్ ని బయటకు పంపడమే తన కర్తవ్యం అంటూ బహిరంగంగానే అన్నాడు.  ఇలా ఎన్నో వివాదాలు వీరి మద్య నడిచాయి.  మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ అయ్యాడు. ఇక కౌశల్ టైటిల్ ను గెలుచుకుని వచ్చాక కూడా, మీడియా డిబేట్లలో విమర్శలను సంధించడం బాబు గోగినేని మానుకోలేదు. కౌశల్ రూల్స్ ను బ్రేక్ చేశాడనీ .. సోషల్  మీడియాను మానిప్యులేట్ చేశాడని ఆరోపించారు. హౌస్ లో నుంచి కొన్ని సంకేతాలు పంపినట్టుగా అనుమానాలున్నాయని అన్నారు.

ఈ విషయం పై ఫ్యాన్స్ ఫైర్ అవుతూ వచ్చాయి.  తాజాగా బాబు గోగినేని  చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కౌశల్.. "ఆరోపణలు చేయడం కాదు .. ప్రూవ్ చేయాలి. నేను డబ్బులు పంచి గెలిచినట్టుగా బాబు గోగినేని నిరూపిస్తే, బిగ్ బాస్ టైటిల్ ను ఆయన చేతిలో పెట్టేసి వెళ్లిపోవడానికి సిద్ధంగా వున్నాను.  అయితే కొంటే పది మందిని..లేదా వెయ్యి మందిని కొనొచ్చు..కానీ 40 కోట్ల మందిని  కొనగలనా..వారి మంచి మనసు..వారి అభిమానం వెలకట్టలేనిది..అలాంటి వారి అభిమానుల విషయంలో ఇంత నీచంగా మాట్లాడటం..సంస్కారం కాదని అన్నాడు కౌశల్. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: