పవన్ కోసం అజ్ఞాత వ్యక్తి మీడియా సాహసం !

Seetha Sailaja
పవన్ కళ్యాణ్ రాబోతున్న ఎన్నికలలో తన ‘జనసేన’ ను బలపరిచే మీడియా సంస్థల అండ ఉండాలి అన్నవిషయం చాల ఆలస్యంగా గ్రహించాడు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ రాజకీయ పార్టీనేతలుగా ఎదిగిన ప్రతి వ్యక్తికి ఒకటికి మించిన న్యూస్ ఛానల్స్ న్యూస్ పేపర్స్ సపోర్ట్ ఉన్న నేపధ్యంలో ఒక నాయకుడుగా ఎదగడానికి మీడియా అవసరం ఎంతో ఇప్పటికి పవన్ కళ్యాణ్ కు జ్ఞానోదయం అయింది. 

ఇప్పటికే పవన్ ‘99’ టివి యాజమాన్యాన్ని తన చేతిలోకి తీసుకున్నా ప్రస్తుతం న్యూస్ ఛానల్స్ మధ్య పెరిగిపోయిన విపరీతమైన పోటీ నేపధ్యంలో ‘99’ టివి అనుకున్న స్థాయిలో తన ప్రసారాల పరిధిని విస్తృతం చేయలేకపోతోంది. ఇలాంటి పరిస్థుతులలో ఒకప్రముఖ ఎన్ఆర్ఐ కేవలం పవన్ జనసేన కోసం భారీ ఖర్చుతో ఒక న్యూస్ ఛానల్ ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం చాల న్యూస్ ఛానెల్స్ ఫాలో అవుతున్నట్టుగానే ఈ ఛానెల్ పేరుకు కూడా '9' అన్న అంకెను పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆసంఖ్యకు ముందు ఏపేరు పెడితే బాగుంటుంది అన్న చర్చలు జరుగుతున్నట్లు టాక్. ఈ ఛానల్ కు సంబంధించిన టెక్నికల్ సెటప్ అంతా పూర్తి కావడంతో దసరా పండుగ నుండి టెస్ట్ సిగ్నల్స్ ఇవ్వబోతున్నారని టాక్. 

ఇప్పటికే అనేక న్యూస్ ఛానల్స్ లో పనిచేసిన కొందరు విశేష అనుభవం ఉన్న వ్యక్తులను ఈ ఛానల్ కోసం ఎంపిక చేసుకోవడం జరిగింది అని వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు దినపత్రికలలో ప్రస్తుతం ఏదిన పత్రికా పవన్ కు ఓపెన్ గా సపోర్ట్ చేయకపోయినా ఆంధ్రప్రభ మాత్రం ఓపెన్ గా పవన్ కళ్యాణ్ కు వంత పాడే దినపత్రికగా మారింది. అయితే ఆంధ్రప్రభకు ఉన్న పరిది చాల తక్కువ అయిన నేపధ్యంలో ఈ కొత్త ఛానల్ ఎంత వరకు పవన్ కళ్యాణ్ ను రాబోతున్న ఎన్నికలలో కింగ్ మేకర్ గా మార్చగలదో చూడాలి..   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: