అల్లు అర్జున్ స్ట్రాటజీని అర్ధం చేసుకోలేకపోయిన నాని !

Seetha Sailaja
‘బిగ్ బాస్ 2’ పూర్తి అయి వారంరోజులు పూర్తి అవుతున్నా ఈషో వల్ల తీవ్ర మనోవేదనకు గురి అయిన నాని ఆషాక్ నుండి ఇంకా తేరుకోలేక పోతున్నాడు అన్న వార్తలు వస్తున్నాయి. ఈషో ప్రారంభం అయిన మొదటిరోజు నుండి నాని సామర్ధ్యాన్ని జూనియర్ తో పోలుస్తూ కామెంట్స్ చేయడంతో పాటు ఆతరువాత ఈషోకు వచ్చిన లో టీఆర్పీ రేటింగ్స్ పై కూడ విపరీతమైన విమర్శలు వచ్చాయి.  

దీనికితోడు ఈషో విన్నర్ గా ఎంపిక అయిన కౌశల్ అభిమానులు కౌశల్ ఆర్మీ పేరిట చేసిన హంగామాను నాని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు అన్న కామెంట్స్ ఇప్పటికీ నానీని వెంటాడుతూనే ఉన్నాయి. వాస్తవానికి కౌశల్ ఇగో యాటిట్యూడ్ మొదటి నుంచే పసిగట్టి అతడికి చెక్ పెట్టె విషయంలో నాని సమర్ధవంతంగా వ్యవహరించలేకపోయాడు అన్న కామెంట్స్ ఇప్పటికీ చాలామంది చేస్తూనే ఉన్నారు. 


ఇలాంటి పరిస్థుతులలో నాని ‘బిగ్ బాస్ 2’ విషయమై ఒక ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.  నెగెటివిటీని హ్యాండిల్ చేయడంలో తనకు ఇబ్బంది కలిగినా ‘బిగ్ బాస్’ షో తనకు ఒక గుణ పాఠం అంటూ తన సినిమాలు ఫ్లాప్ అయినప్పడు కూడా ఇలాంటి నెగెటివిటీ చూడలేదని నాని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. అంతేకాదు స్వతహాగా తాను సెన్సిటివ్ అయిన నేపధ్యంలో ఒకేసారి చాలామంది తనపై విమర్శలు ట్రోల్స్ లాంటివి చేయడం భరించలేకపోయాను అని అంటున్నాడు.


ఇప్పుడు ఈ కామెంట్స్ అల్లు అర్జున్ దృష్టి వరకు వెళ్ళడంతో బన్నీ తన సన్నిహితులతో నాని పడ్డబాధ పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసినట్లు టాక్. వాస్తవానికి ‘బిగ్ బాస్ 2’ షో హోస్ట్ చేయమని స్టార్ మా యాజమాన్యంతో పాటు తన తండ్రి అల్లు అరవింద్ నుండి ఎంతో ఒత్తిడి వచ్చినా జూనియర్ తో పోలుస్తూ ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ వస్తాయని తాను ముందే ఊహించి ఈ షోను హోస్ట్ చేయలేదు అంటూ కామెంట్స్ చేసినట్లు టాక్. అంతేకాదు బిగ్ బాస్ షో గురించి సగటు బుల్లితెర ప్రేక్షకుడికి కూడ పూర్తిగా తెలిసిపోవడంతో రానున్న రోజులలో ‘బిగ్ బాస్ 3’ ని హోస్ట్ చేయడానికి టాప్ హీరోలు ఎవ్వరూ ముందుకు రాకపోవచ్చు అన్న అభిప్రాయాన్ని బన్నీ తన సన్నిహితులతో వ్యక్త పరిచినట్లు సమాచారం.. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: