చరణ్ బోయపాటిల మూవీకి ఎన్టీఆర్ ట్రేడ్ మార్క్ !

Seetha Sailaja
‘రంగస్థలం’ సూపర్ సక్సస్ తరువాత రామ్ చరణ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న మూవీకి టైటిల్ ఇంకా ఫిక్స్ కాకపోవడంతో ఈమూవీ టైటిల్ గురించి అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాబోతున్న సంక్రాంతిని టార్గెట్ చేస్తూ విడుదల కాబోతున్న ఈమూవీ ‘రంగస్థలం’ రికార్డులను బ్రేక్ చేయాలి అన్న పట్టుదలతో నిర్మిస్తున్నారు. 

వాస్తవానికి ఈసినిమాతో పోటీగా విడుదల అవుతున్న ఎన్టీఆర్ బయోపిక్ హడావిడి చాల ఎక్కువగా కనిపిస్తూ ఉన్నా చరణ్ బోయపాటిల మూవీకి సంబంధించిన ఫోటోలు కానీ అదేవిధంగా ఈమూవీ టైటిల్ ఫస్ట్ లుక్ ఇంకా విడుదల కాకపోవడంతో చరణ్ అభిమానులు ఇప్పటికే తీవ్ర అసహనంలో ఉన్నారు. ఇలాంటి పరిస్థుతులలో చరణ్ అభిమానుల అసహనాన్ని తగ్గించేందుకు ఈమూవీ టైటిల్ ప్రకటన రాబోతున్న విజయదసమికి ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఈవార్తలకు మరింత బలం చేకూరుస్తూ ఈమూవీ నిర్మాత ‘వినయ విధేయ రామ’ అన్న టైటిల్ ను రిజిస్టర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ‘రాముడు’ ‘రామ’ కృష్ణుడు’ టైటిల్స్ తో ఎక్కువ సినిమాలు నందమూరి హీరోలతో వచ్చిన నేపధ్యంలో ఈ టైటిల్స్ అన్నీ నందమూరి ఫ్యామిలీ ట్రేడ్ మార్క్ గా మారిపోయాయి.

అలాంటి పరిస్థుతులలో చిరంజీవి వారసుడు సినిమాకు ఎన్టీఆర్ ట్రేడ్ మార్క్ టైటిల్ పెట్టడం ప్రస్తుతం సంచలనంగా మారింది. దీనికితోడు ఫ్యాక్షన్ సినిమాలను తీసే బోయపాటి మూవీకి ఇలాంటి సాఫ్ట్ టైటిల్ రిజిస్టర్ చేయడం మరింత సంచలనంగా మారింది. గతంలో బోయపాటి ‘జయ జయ జానకీ నాయక’ అంటూ సాఫ్ట్ టైటిల్ తో ఒక ఊచకోత సినిమాను తీసాడు. ఇప్పుడు మళ్ళీ అదే పద్ధతి రిపీట్ చేస్తూ బోయపాటి చరణ్ కోసం ఇలాంటి టైటిల్ ప్రయోగం చేయడం ఎంత వరకు విజయవంతం అవుతుందో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: