నా మీద పడి పెదాలను కొరికి వాడు దర్శకుడి పైనా నటీ సంచలన వ్యాఖ్యలు...!

Prathap Kaluva

సినీ ఇండస్ట్రీ లోని చీకటి భాగోతాలను హీరోయిన్స్ ఒక్కొక్కరు బయటికి చెబుతున్నారు. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్, క్వీన్ మూవీ దర్శకుడు వికాస్ బెహల్‌పై లైంగిక ఆరోపణలు రావడం సినీ వర్గాల్లో మరోసారి సంచలనంగా మారింది. బాంబే వెల్వెట్ ప్రమోషన్‌ టూర్‌లో తనను లైంగిక వేధించాడని ఓ నటి ఆరోపణలు చేసింది. బలవంతంగా దౌర్జన్యం చేసి ముద్దు పెట్టుకోవాలని చూశాడు అని ఆమె పేర్కొన్నది. బాలీవుడ్ వెబ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో తన పేరు వెల్లడించడానికి సదరు నటి నిరాకరించారు.


ఆమె చేసిన ఆరోపణలు ఏమిటంటే.. వికాస్ బెహల్ చాలా చెత్త వ్యక్తి. అతని పక్కన ఉండాలంటే ఓ రకమైన భయం ఉండేది. దాదాపు 20 మందితో పార్టీ జరిగింది. ఆ పార్టీలో పీకలదాకా తాగినట్టు నటించాడు. మద్యం మత్తులో ఉన్నట్టు నటిస్తూ నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. నా పెదాలపై ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. దాంతో ఆయనను పక్కకు తోశాను. అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తే అడ్డుకొన్నాడు అని సదరు నటి వెల్లడించింది. 


క్వీన్ సినిమా షూటింగ్ సమయంలో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని బాలీవుడ్ నటి కంగన రనౌత్ సంచనల వ్యాఖ్యలు చేసింది. తనను గాఢంగా కౌగిలిలో బంధించి ఊపిరి సలపకుండా చేశాడు. మాటలతో శృంగారానికి దిగేవాడు. నోటి నుంచి బూతు పదాలు ఎక్కువగా వచ్చేవి. ఎదుటి వారికి ఇష్టం ఉన్నా, లేకున్నా తనకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాడు అని ఆ నటి చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: