విజయ్ దేవరకొండ అభిమానులకు ఆగ్రహం తెప్పించిన నిఖిల్ వివాదాస్పద వ్యాఖ్యలు

Seetha Sailaja
‘స్వామి రారా’ ‘కార్తికేయ’ లాంటి సినిమాల విజయంతో యంగ్ హీరో నిఖిల్ మంచి  టాప్ రేంజికి వెళ్లి పోతాడు అని భావించారు. అయితే అనూహ్యంగా నిఖిల్ ఆతరువాత నటించిన చాలా సినిమాలు ఫ్లాప్ కావడంతో ఇప్పుడు ఈ యంగ్ హీరో పరిస్థితి అగమ్యగోచారంగా మారింది. ఇలాంటి పరిస్థితులలో నిఖిల్ ఈమధ్య విజయ్ దేవరకొండ పేరు పైకి చెప్పకుండా సోషల్ మీడియాలో పెట్టిన ఒక ట్విట్ వివాదాస్పదంగా మారింది. 

ఈమధ్య హీరో విజయ్ దేవరకొండ ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ ‘నోటా’ ఫెయిల్యూర్ ను కొందరు ఎంజాయ్ చేస్తున్నారు అంటూ కామెంట్స్ చేసాడు. అంతేకాదు కొందరు ఇండస్ట్రీ వ్యక్తులు తన ‘నోటా’ ఫెయిల్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకున్నారు అంటూ మరో ట్విస్ట్ ఇచ్చాడు. ఈ కామెంట్స్ కు నిఖిల్ స్పందిస్తూ విజయ్ దేవరకొండ పేరు చెప్పకుండా ఆసక్తికర కామెంట్స్ చేసాడు. 

మీడియా హైక్ గురించి ఆలోచించకుండా ఎక్కువ పనిచేసిన వారికి బాగా విజయాలు వస్తాయి అంటూ నిఖిల్ కామెంట్ చేసాడు. అంతేకాదు కొందరు పెరిగిపోయిన తమ యాటిట్యూడ్ తో ప్రపంచం తమ చుట్టూ తిరుగుతోంది అన్న భావనలో ఉంటున్నారని ప్రతీ నటుడు తనకు తానే పోటీ పడాలి కాని పక్క హీరోలతో కాదు అంటూ వ్యూహాత్మక కామెంట్స్ చేసాడు. 

అయితే నిఖిల్ చేసిన ఈ ట్విట్ పెనుప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ అభిమానులు డైరెక్ట్ గా నిఖిల్ ను టార్గెట్ చేస్తూ  ‘ఎంత జెలసీ ఉంటె మాత్రం ఇంతగా బయట పడతావా’ అంటూ నిఖిల్ ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు తమ హీరో ఇప్పటికే ఎంతో సాధించాడని ఇంకా కేవలం ప్రయత్నాలలోనే నిఖిల్ ఉన్నాడు అంటూ కామెంట్స్ చేస్తూ నిఖిల్ ను ఆట పట్టిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ అభిమానుల తరువాత అదే స్థాయిలో రెచ్చిపోతున్న  విజయ్ దేవరకొండ అభిమానులతో పెట్టుకుంటే ఎవరికైనా ఇలాంటి పరిస్థితి వచ్చేలా ఉంది..
 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: