అస్ట్రియాకు అనుష్క షెట్టి? అసలు కథేంటి?

పై టైటిల్ చూసి స్వీటీ అనుష్కా షెట్టి ఏదో సినిమా షూటింగ్ కోసం వెళ్తుందని అనికునేరు సుమా! అది ఒక సినిమా అవసరం కోసం బరువు పెరిగి ఆ తరువాత బరువు తగ్గించుకోవడం కోసం అనేక ఇబ్బందులు పడుతున్న‌ టాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క‌ బరువు తగ్గటం కోసం మాత్రమే.   ‘సైజ్ జీరో’ సినిమా కోసం బరువు పెరిగి ఆ తరువాత తగ్గడానికి చాలా కష్టపడింది.  అయినా బాహుబలి ది కంక్లూజన్, సింగం-౩ వంటి సినిమాలలో లావుగా కనిపించిందనే విమర్శలు వినిపించాయి. ఆమె చివరి గా నటించిన  ‘భాగమతి’ సినిమాలో కూడా అందంగా కనిపించినా మందం తగ్గిన దాఖలాలు లేవు. 
 
ఈ సినిమా తరువాత జేజమ్మ అనుష్క ఇప్పటివరకు మరే సినిమాకు కూడా అంగీకరించలేదు. బరువు తగ్గడం కోసం డైటింగ్, వర్కవుట్లు చేసింది. దీని కారణంగా ఆమెకి “బ్యాక్ పెయిన్” కూడా వచ్చింది. వెన్నునొప్పితో బాధపడు తున్న ఆమె కేరళలో  “స్పా థెరపీ” కూడా తీసుకుంది.  అయినా ఈ ముద్దు గుమ్మ బొద్దు గుమ్మగానే ఉండి పోయారు. బరువు ఏ మాత్రం త‌గ్గ‌లేదు. బరువు కార‌ణంగానే సాహో మూవీ ఛాన్స్ ను కూడా వ‌దులుకోవ‌ల‌సి వ‌చ్చింది.  బ‌రువు త‌గ్గ‌డం కోసం దేశవ్యాప్తంగా ఎన్నో హెల్త్ సెంటర్స్ తిరిగి ప్రయత్నాలు చేసినా ఫ‌లితం మాత్రం శూన్యం. ఏ రకమైన వర్కవుట్ కూడా ఈమెకు వర్కవుట్ కాలేదని తెలుస్తోంది. 


ఇక సహజ సిద్ధమైన పద్దతుల ద్వారానే బరువు తగ్గాలని భావిస్తోన్న అనుష్క కి కొందరు ఆస్ట్రియా వెళ్లమని సలహా ఇచ్చారట. అక్కడ నాచురోపతి డిటాక్స్ ప్రోగ్రాం ద్వారా సహజంగా బరువు తగ్గించు కోవడానికి సహజ సిద్ధమైన వైద్యం ప్రసిద్ధి చెందిందని అందుకు అక్కడికే వెళ్ళమని సూచించడంతో ఇటీవల అనుష్క ఆస్ట్రియా వెళ్లింది. అక్క‌డే రెండు నెల‌ల పాటు ఉండి కొత్త అనుష్క‌లా మారి తిరిగిరానుంద‌ని టాక్. 

బాలీవుడ్ నటులు రణబీర్ కపూర్, ప్రియాంక చోప్రాలు నాచురోపతి డిటాక్స్ ప్రోగ్రాం ద్వారా సహజంగా ఎలాంటి డైట్ నిబంధనలు పాటించకుండానే  "డైట్ కరెక్షన్" ద్వారా సాధారణ బరువును పొందారు. దాన్నే నేడు అనుష్క అనుసరించి బరువు తగ్గించుకొని స్వీటీ సైజుతో తిరిగిరానుందట. వి విష్ హర్ ఆల్ ది బెష్ట్.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: