అరవింద సినిమా లో కామెడీ లేకపోతే ఎందుకు చూడాలి ... సీరియస్ అయిన ఎన్టీఆర్ ...!

Prathap Kaluva

అరవింద సమేత సినిమా చుసిన ప్రతి ప్రేక్షకుడు కామెడీ లేదని కామెంట్ చేశారు అయితే కామెడీ ట్రాక్ ను కావాలనే తొలిగించాము అని త్రివిక్రమ్ చెప్పారు.అయితే ఇదే విషయమై యాంకర్ కామెడీ లేదని ఎందుకు చూడాలని రీతిలో మాట్లాడింది . దీనితో కాస్త సహనం కోల్పయిన ఎన్టీఆర్ తనదైన రీతిలో సమాధానం చెప్పాడు. దసరా బరిలో రిలీజైన ఈ సినిమాలో కూసింత కామెడీ ఉంటే బాగుండేదని కోరుకున్నోళ్లు కోకొల్లలు. ఎట్టకేలకు ఈ విషయంపై త్రివిక్రమ్-ఎన్టీఆర్ కలిసి కామన్ గా క్లారిటీ ఇచ్చారు.


ఈ కథ కామెడీ అడగలేదు. కామెడీ వల్ల రసభంగం జరుగుతుందని అనిపించింది. సెకెండాఫ్ లో పాట పెట్టడానికే భయపడ్డాం. ఎందుకంటే కథ వెళ్తున్న స్పీడ్ కు బ్రేక్ వేయడానికి భయమేసింది. అందుకే కామెడీ పెట్టలేదు." ఆడియన్స్ తన నుంచి కామెడీ ఆశిస్తారనే విషయం తనకు తెలుసని, కానీ కామెడీ లేకపోతే ఏమౌతుందనే భయాన్ని ముందు తీసేశామని అంటున్నాడు త్రివిక్రమ్.


నిజంగానే కామెడీ పెట్టాలనుకుంటే, వేరే కథ సెలక్ట్ చేసుకునేవాడనని అంటున్నాడు. అటు ఎన్టీఆర్ కూడా త్రివిక్రమ్ మాటల్ని బలపరిచాడు. త్రివిక్రమ్ ఎప్పుడూ కామెడీకే ఎందుకు ఫిక్స్ అయిపోవాలని ప్రశ్నిస్తున్నాడు తారక్. త్రివిక్రమ్ ఎప్పుడూ కామెడీ కథే ఎందుకు రాయాలి. కామెడీ ట్రాక్ రాసుకునే కామెడీ డైరక్టర్ కాదాయన. ఒక చట్రంలో తోసేస్తే ఎలా. ఒకసారి కామెడీ కథ చెప్పాలనుకుంటారు, ఒకసారి థ్రిల్లర్, మరోసారి హారర్ అనుకుంటారు. ఇలా త్రివిక్రమ్ అన్నీ చేయాలి." ఓవరాల్ గా అరవింద సమేతలో కామెడీ పెట్టకూడదని నిర్ణయించుకొని మరీ సెట్స్ పైకి వెళ్లామంటున్నారు త్రివిక్రమ్, ఎన్టీఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: