‘అర్జున్ రెడ్డి’కమెడియన్ పెళ్లి చేసుకోబోతున్నాడట!

Edari Rama Krishna
బుల్లితెరపై షార్ట్ ఫిలిమ్ తో తన ప్రస్థానం మొదలు పెట్టి..‘అర్జున్ రెడ్డి’,‘గీతాగోవిందం’తో మంచి కమెడియన్ గా స్థిరపడ్డాడు రాహూల్ రామకృష్ణ.  తెలంగాణ యాసతో ప్రత్యేకమైన మానరీజంతో అందరినీ కడుపుబ్బా నవ్విస్తున్నాడు రాహూల్ రామకృష్ణ. ఆ మద్య మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ చిత్రంలో కూడా కీలక పాత్రలో కనిపించాడు ఈ యంగ్ కమెడియన్. 

త్వరలో రాహూల్ రామకృష్ణ ఇంట  పెళ్లిభాజా మోగబోతుందట.  దీనికి సంబంధించిన వార్త మనోడే చాలా డిఫరెంట్ గా కామెడీగా ట్విట్ చేశాడు.  తన సోషల్ మీడియా పేజ్‌లో బీచ్‌లో తనకు కాబోయే భార్యతో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేసిన రాహుల్‌ ‘జనవరి 15న నేను పెళ్లి చేసుకోబోతున్నాను. ఎవరికీ చెప్పకండి’ అంటూ కామెంట్‌ చేశాడు. 

ఇంకేముంది ఈ ట్విట్ చూసి రాహూల్ అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.  హీరోలు నిఖిల్ సిద్ధార్థ్, సుశాంత్‌, కమెడియన్ వెన్నెల కిశోర్‌, విద్యుల్లేఖ రామన్‌ లు రాహుల్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
Psst.. I’m getting married on January 15th.

Don’t tell anyone.

Seriously. pic.twitter.com/fx4mVulayv

— Rahul Ramakrishna (@eyrahul) October 22, 2018

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: