విజయ్ 'సర్కార్' తమిళనాడులో సంచలనం

shami
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ లీడ్ రోల్ లో మురుగదాస్ డైరక్షన్ లో వస్తున్న సినిమా సర్కార్. టీజర్ తో సంచలనం సృష్టించిన ఈ సినిమా ట్రైలర్ కూడా సినిమాపై మరింత హోప్స్ పెంచేలా చేసింది. ప్రత్యేకమైన సినిమాలను చేసే మురుగదాస్ స్పైడర్ తర్వాత చేస్తున్న ఈ సినిమా పూర్తిగా కసితో చేసినట్టు తెలుస్తుంది.


ట్రైలర్ చూస్తే సినిమా పక్కా హిట్ అన్న భావన వస్తుంది. అసలే సూపర్ ఫాంలో ఉన్న విజయ్ ఈ సర్కార్ అక్కడ సంచలనంగా మారింది. అందుకే ప్రీ రిలీజ్ బిజినెస్ లో రికార్డ్ సృష్టించింది. తమిళనాడులో విజయ్ సర్కార్ 80 కోట్ల బిజినెస్ చేసిందట. తమిళనాడులో ఏ సినిమా కూడా 70 కోట్ల మార్క్ దాటింది లేదు.


బాహుబలి సినిమా కూడా అక్కడ ఇంత బిజినెస్ చేయలేదు. బాహుబలి 2 తమిళ్ లో 79 కోట్ల షేర్ రాబట్టింది. ప్రస్తుతం విజయ్ సర్కార్ 80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అంటే బాహుబలి-2 కలక్షన్స్ మించి వసూళు చేయాలి. విజయ్ మర్సల్ సినిమా ఆల్రెడీ వరల్డ్ వైడ్ 127 కోట్లు వసూళు చేసింది. 


ఆ లెక్కన చూస్తే సర్కార్ సినిమా కూడా రికార్డులు సృష్టించడం ఖాయమని అంటున్నారు. మురుగదాస్ డైరక్షన్.. విజయ్ యాక్టింగ్ కలిసి ఈ సర్కార్ ను సంచలనంగా మార్చబోతున్నాయి. మరి హయ్యెస్ట్ బిజినెస్ తో అదరగొడుతున్న విజయ్ సర్కార్ హయ్యెస్ట్ కలక్షన్స్ తో కూడా సాధిస్తుందేమో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: