తమన్ లెక్కలలో తేడాలు అరవిందతో దక్కని గౌరవం !

Seetha Sailaja
టాప్ హీరోలు అందరితోను సినిమాలు చేసిన తమన్ తన సినిమాలకు సంబంధించిన వర్క్ ను అత్యంత వేగంగా చేస్తాడు అన్న కామెంట్స్ ఉన్నాయి. దీనికితోడు పారితోషికం విషయంలో దేవీశ్రీప్రసాద్ కంటే బాగా తక్కువ తీసుకుంటాడు కాబట్టి చాలామంది దర్శక నిర్మాతలు తమన్ ట్యూన్స్ పై కాపీ వివాదాలు ఉన్నా అవి పట్టించుకోకుండా తమన్ కు అవకాశాలు ఇవ్వడం అలవాటుగా మారిపోయింది. 

ఇలాంటి పరిస్థుతులలో తమన్ లేటెస్ట్ గా చేసిన ట్విట్ చాలమందిని ఆశ్చర్య పరుస్తోంది. ‘అరవింద సమేత’ తన సంగీత దర్శకత్వంలో వచ్చిన 100వ సినిమా అంటూ ఈసినిమా హడావిడి అంతా పూర్తి అయ్యాక తమన్ ప్రకటించడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. 

‘అరవింద’ ప్రమోషన్ లో కాని సక్సస్ మీట్ లో కాని తమన్ తన 100వ సినిమా ‘అరవింద సమేత’ అని చెప్పకుండా ఇంత ఆలస్యంగా ఎందుకు చెపుతున్నాడు లెక్కలలో పొరపాటా ? లేదంటే దీని వెనుక ఏమైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి. తమన్ 50వ సినిమాగా సంగీత దర్శకత్వం వహించిన మహేష్ ‘ఆగడు’ సమయంలో తమన్ గురించి ఎంతో హడావిడి జరిగింది. 

అయితే అలాంటి అవకాశం ‘అరవింద సమేత’ లాంటి మంచి సినిమాతో వచ్చినా తమన్ ఎందుకు వదులుకున్నాడు అని కొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. ‘అరవింద’ మూవీకి తమన్ ఇచ్చిన ట్యూన్స్ విపరీతంగా పాపులర్ కావడంతో తమన్ పై ఇప్పటి వరకు ఉన్నా నెగిటివ్ ప్రచారం అంతా కరిగిపోయింది. త్వరలో విడుదల కాబోతున్న రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ పాటల ఆడియో ఫంక్షన్ లో తమన్ 100 సినిమాల రికార్డ్ కు సంబంధించిన హడావిడి జరిగే ఆస్కారం ఉంది..   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: