దాసరి మళ్ళీ పుట్టాడు......అలా చూడొచ్చు...!!

Satya
అపుడెపుడో దేవదాసు మళ్ళీ పుట్టాడు అంటూ మూవీ వచ్చింది. దానిని తీసింది లెజెండరీ డైరెక్టర్ దాసరి నారాయణరావు. అలాంటి  ప్రయోగాలు చేయడంతో దిట్ట అయిన దాసరి కొద్ది కాలం క్రితమే అందరినీ వదిలి వెళ్ళిపోయారు. ఆయన సినిమాలే తీపి గురుతులుగా మిగిల్చారు. సరే ఇపుడు దాసరి ప్రస్తావన ఎందుకంటే ఆయన మళ్ళీ పుట్టాడు. ఆయన మన ముందుకు రాబోతున్నారు. ఎలాగంటారా


అన్న గారి జీవిత చరిత్రతో ఎన్టీఆర్ బయోపిక్‌ మూవీని ఆయన తనయుడు బాలయ్య తీస్తున్నారు కదా. అందులో సినిమా జీవితం కీలకమైన అంశంగానే ఉంది. సినిమా జీవితంలో అన్న గారు ఎన్నో మేటి పాత్రలు వేసి సాటి లేని నటనను ప్రదర్శించారు. అలా దాసరి నారాయణరావు అన్న గారి కాంబోలో మెయిల్ స్టోన్ లాంటి మూవీస్ వచ్చాయి. బొబ్బిలి పులి, సర్దార్ పాపారాయుడు మనుషులంతా ఒక్కటే వంటివి ఉన్నాయి.

సర్దార్ పాపారాయుడు మూవీ ద్వారా అన్న గారు ఆలొచనలు సినిమా వైపు నుంచి రాజకీయాల వైపున‌కు మళ్ళాయని అంటారు. మరి అంతటి కీలకమైన సినిమా దర్శకుడు ఎన్టీఆర్ బయోపిక్‌లో కనిపించకపోతే ఎలా. అందువల్లనే దాసరి పాత్ర కూడా ఈ మూవీలో ఉండబోతోందట.


ఇంతకీ దాసరి గా పాత్రను ఎవరు పోషించబోతున్నారంటే ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. డైనమిక్ డైరెక్టర్ వీవీ వినాయక్ దాసరి గా ఈ సినిమాలో కనిపించబోతున్నారట. వినాయక్ కూడా దాసరి ప్రియ శిష్యుడు. అంతే కాదు. ఎన్నో హిట్ మూవీస్ తీసిన దర్శకుడు. ఆయనను ఈ పాత్ర కోసం సంప్రదించి ఒకే అనిపించుకున్న చిత్ర యూనిట్ ఆ సీన్లను షూట్ చేసే పనిలో బిజీగా ఉందట. సో. మళ్ళీ మనం దాసరిని వెండి తెరపై చూడొచ్చన్నమాట. మన కోసం దాసరి మళ్ళీ పుడుతున్నరన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: