అక్కినేని బయోపిక్ ను తప్పించి తన స్వీయచరిత్ర పై దృష్టిపెట్టిన నాగార్జున !

Seetha Sailaja
గత కొంతకాలంగా చాలామంది అక్కినేని అభిమానులు నాగార్జునను అక్కినేని నాగేశ్వరావు బయోపిక్ తీయమని అడుగుతున్నారు. అయితే తన తండ్రి జీవితంలో చెప్పుకోతగ్గ సంచలనాలు మరియు వివాదాలు లేని నేపధ్యంలో అక్కినేని బయోపిక్ తీసినా పెద్దగా ప్రేక్షకులు చూడరు అంటూ నాగార్జున ఆవిషయాన్ని తెలివిగా తప్పించాడు.

అయితే అనూహ్యంగా ఇప్పడు నాగార్జున తన స్వీయ చరిత్ర వ్రాయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈప్రయత్నం నాగ్ తనకోసం కాకుండా ఈమధ్యనే చెన్నైలో మరణించిన ప్రముఖ నిర్మాత నాగార్జున చిరకాల మిత్రుడు శివ ప్రసాద్ రెడ్డి కోసం అని అంటున్నారు. నిర్మాత శివ ప్రసాద్ రెడ్డి నాగార్జునకు చిన్ననాటి స్నేహితుడు అవ్వడమే కాకుండా అతడు నిర్మాతగా మారిన తరువాత ఏకంగా 11  సినిమాలు నాగ్ తోనే తీసాడు. 

కామాక్షి ఫిలిమ్స్ బ్యానర్ పై ఎందరో టాప్ హీరోలతో గతంలో శివ ప్రసాద్ రెడ్డి సినిమాలు తీసాడు. అయితే శివ ప్రసాద్ రెడ్డి సినిమాలకు దూరం అయిన తరువాత నాగార్జునతో తన స్నేహాన్ని వివరిస్తూ నాగ్ జీవితం పై ఒక పుస్తకం వ్రాసాడు. ఈ పుస్తక రచన దాదాపు 70 శాతం వరకు పూర్తి అయినట్లు సమాచారం. 

ఈపుస్తకాన్ని వచ్చే ఏడాది జరగబోతున్న నాగార్జున షష్టిపూర్తి సందర్భంగా ఈపుస్తకాన్ని విడుదలచేయాలని నాగార్జున మిత్రుడు శివ ప్రసాద్ రెడ్డి ఆలోచన. అయితే అనుకోకుండా శివ ప్రసాద్ రెడ్డి మరణించడంతో అతడు పూర్తి చేయకుండా మిగిలిపోయిన పుస్తకాన్ని రచయితగా మారి తాను పూర్తిచేసి తన ప్రియ మిత్రుడుకి అంకితం ఇవ్వాలి అన్న ఆలోచనలో నాగార్జున ఉన్నట్లు సమాచారం..   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: