దీపావళి కానుకగా 'ఎఫ్ 2' ఫస్టులుక్ !

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ ఈ మద్య వరుసగా మల్టీస్టారర్ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.  ప్రస్తుతం వెంకటేష్ మెగా అబ్బాయి వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్నాడు.  తెలుగు యువ దర్శకులలో వరుస విజయాలను దక్కించుకుంటున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఫుల్ లెన్త్ కామెడీ, ఫ్యామిలీ ఎంట్రటైన్ మెంట్ గా తెరకెక్కుతున్న  ఎఫ్‌2(ఫన్‌ అండ్‌ ఫస్ట్రేషన్‌) చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కొద్ది సేపటి క్రితం రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

ఇప్పటి వరకు అనీల్ రావిపూడి తెరకెక్కించిన 'పటాస్' .. 'సుప్రీమ్' .. 'రాజా ది గ్రేట్' ఆయన దర్శక ప్రతిభకు అద్దం పడుతాయి. వినోదాత్మకంగా సాగే ఎఫ్‌2(ఫన్‌ అండ్‌ ఫస్ట్రేషన్‌) చిత్రషూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. వెంకటేశ్ .. వరుణ్ తేజ్ కథానాయకులుగా నటిస్తోన్న ఈ సినిమాలో, వెంకీ సరసన తమన్నా .. వరుణ్ జోడీగా మెహ్రీన్ నటిస్తున్నారు.

దీపావళి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ద్వారా దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.  దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
Oo araganta ...munduga....😀😀😀..Here go...#F2 first look #VictoryVenkatesh.garu...@IAmVarunTej @tamannaahspeaks @Mehreenpirzada @ThisIsDSP Garu..😀😀😀 pic.twitter.com/GWvBWpTegJ

— Anil Ravipudi (@AnilRavipudi) November 5, 2018

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: