రవిబాబు ఫ్రస్ట్రేషన్‌ వెనుక టాప్ సీక్రెట్ !

Seetha Sailaja
ఈరోజు విడుదలకాబోతున్న ‘అదుగో’ సినిమాను ప్రమోట్ చేస్తూ రవిబాబు ఈసినిమా తీసే సమయంలో తాను ఈసినిమా వదిలేసి పారిపోదాము అని అనుకున్న పరిస్తుతులను ఆసక్తి కరంగా వివరించాడు. ప్రస్తుతం సినిమాలు చూస్తున్న ప్రేక్షకులకు వేరే ఛాయస్ లేక చూసిన సినిమాల కథలనే మళ్ళీ కొత్త సినిమాలుగా చూస్తున్నారు అన్న తన అభిప్రాయంతో ప్రేక్షకులకు వెరైటీ సినిమాగా ‘అదుగో’ ను రూపొందించాలి అనుకుంటే ఈమూవీ వల్ల తనకు ఎదురైన కష్టాలు తనజీవితంలో మరిచిపోలేను అని అంటున్నాడు రవిబాబు.

‘‘డిస్నీ సినిమాల ప్రభావంతో ఒక జంతువుతో సినిమా తీస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన నుంచి ఈకథ పుట్టుకొచ్చింది అని అంటూ ఇప్పటికే ఏనుగు ఈగ - ఎలుక - జిబ్రా వంటి జంతువులతో సినిమాలు వస్తున్న నేపధ్యంలో తన సినిమాకు పంది పిల్ల అయితే బెస్ట్ అనిపించి తాను ఈకథను ఎంచుకున్నాను అని అంటున్నాడు. పెద్దల మాట వినకుండా బయటి ప్రపంచంలో అడుగుపెట్టిన బంటి అనే పందిపిల్లకు ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి అన్నఅంశం చుట్టూ ఈమూవీ కథ తిరుగుతుంది అంటూ ఈసినిమా కోసం తాను మూడేళ్ళ కాలాన్ని ఖర్చు పెట్టడమే కాకుండా ఈసినిమా టెన్షన్ తో తనకు సినిమాలలో నటించే అవకాశాలు వచ్చినా పట్టించుకోలేదు అని అంటున్నాడు రవిబాబు.

వాస్తవానికి ఈసినిమాను అమెరికా ఆస్ర్టేలియా నుంచి రోబోటిక్‌ సిస్టమ్‌ను తెప్పించి ఆపద్ధతిలో ఆసినిమా చేద్దాము అనుకుంటే దాని ఖర్చు రజినీకాంత్ రెమ్యూనరేషన్ కన్నా ఎక్కువగా కనిపించడంతో చివరికి త్రీడీ యానిమేషన్‌లో ఈమూవీని పూర్తి చేసిన విషయాన్ని బయటపెట్టాడు. ప్రస్తుతం ఆఫ్రికా నుండి తీసుకువచ్చిన 6నెలల పంది పిల్ల తనను వదిలి ఉండడం లేదని తాను లేకుండా తిండి కూడ తినడం లేదని అంటూ ఈమూవీ విడుదల అయ్యాక బంటీ గురించి ఆలోచించకపోతే తనకు ప్రశాంతత ఉండదు అంటూ జోక్ చేసాడు రవిబాబు. 

ఈరోజు విడుదల అవుతున్న ఈమూవీ పై ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా ఈ సినిమాకు వస్తే థ్రిల్‌ అవుతారు అని అంటూ ఈమూవీ సక్సస్ అయితే ఇదే బంటీని హీరోగా మార్చి నాలుగు సీక్వెల్స్ తీస్తాను అంటూ సంకేతాలు ఇస్తున్నాడు. దీపావళి రేసుకు భారీ అంచనాలతో వచ్చిన విజయ్ ‘సర్కార్’ కు డివైడ్ టాక్ వచ్చిన నేపధ్యంలో రవి బాబు పంది పిల్ల బంటీకి అన్ని అవకాశాలు కలిసి వస్తున్నాయి. మరి బంటీ కలిసి వస్తున్న ఈవిషయాన్ని ఎలా తనకు అనుకూలంగా మార్చుకుంటుందో చూడాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: