పవన్ ఇచ్చిన వార్నింగ్ తో అభిమానులలో అసహనం !

Seetha Sailaja
కులమతాలకు అతీతంగా జనసేన’ ను రూపొందించాలి అన్న ప్రయత్నాలలో భాగంగా పవన్ ఈసారి ఏకంగా తన అభిమానులకు వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారిం. పవన్ కల్యాణ్ జనసేన 'కాపు' సామాజిక వర్గానికి కాపు కాసే పార్టీగా మారిపోయింది అని విపరీతంగా కామెంట్స్ వస్తున్న నేపధ్యంలో   ఆ ముద్రను చెరిపేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న పవన్ ఈసారి తన అభిమానులకు వార్నింగ్ ఇచ్చే స్థాయికి ఎదిగిపోయాడు.  

కార్తీకమాసం వచ్చింది అంటే వన భోజనాల హడావిడి కోస్తా జిల్లాలలో విపరీతంగా కనిపిస్తుంది. దీనికితోడు వచ్చే ఏడాది ఎన్నికల సంవత్సరం కావడంతో ప్రతి నాయకుడు ఈ కార్తీక వన భోజనాల నేపధ్యంలో తన రాజకీయ మనుగడ పెంచుకోవడం కోసం ఈ వన భోజనాలను ఒక అస్త్రంగా మార్చుకోబోతున్నారు. ఇలాంటి పరిస్థుతులలో ‘జనసేన’ పార్టీకి సంబంధించిన నాయకులు ఈ నెలలో చాల చోట్ల భారీ స్థాయిలో నిర్వహింపబోతున్న కార్తీక వన భోజనాలకు పవన్ చెక్ పెట్టాడు. 

వన భోజనాల పేరుతో జరిగే సామాజిక వర్గాల సమావేశాల్లో తన ఫొటోలు ఫ్లెక్సీలు పెట్టడం తాను అంగీకరించనని అంటూ తన పేరు మీద జరిగే ఈకార్యక్రమాలకు తనకు ఎటువంటి సంబంధం లేదు అంటూ ప్రకటన ఇవ్వడమే కాకుండా అక్కాచెల్లెళ్లకు ఆడపడుచులకు కార్తీకమాసం శుభాకాంక్షలు తెలియ చేస్తున్నాడు పవన్. ఇది ఇలా ఉంటే ఎన్నికల టైమ్ దగ్గరపడుతున్న కొద్దీ ‘జనసేన’ లో క్రమంగా వలసలు పెరుగుతున్న నేపధ్యంలో ఇప్పటి వరకు పవన్ ‘జనసేన’ జెండాను మోసి పవన్ పై ఎన్నో ఆసలు పెట్టుకున్న పవన్ వీరాభిమానులు జరుగుతున్న పరిణామాలు చూసి నిర్ఘాంత పోతున్నట్లు సమాచారం. 

వివిధ పార్టీల నుండి అనేకమంది జనసేనలో చేరుతున్న నేపధ్యంతో పాటు పవన్ చుట్టూ ఏర్పడ్డ ఒక పవర్ ఫుల్ కోటరీ వర్గం వ్యవహరిస్తున్న తీరుతో పవన్ అభిమానులకు స్థానం లేకుండా పోయింది అని సమాచారం. దీనితో ఈవిషయాలను పవన్ దృష్టికి తీసుకు వెళ్లాలని పవన్ వీరాభిమానులలోని కొందరు కీలక నాయకులు ప్రయత్నాలు చేస్తున్నా అవి ఫలించని నేపధ్యంలో పవన్ వ్యవహార శైలితో విసుకు చెందిన పవన్ అభిమానులు తమ ఆవేదనను బయటకు చెప్పుకోలేక మరొక మార్గం లేక తీవ్ర అసహనంలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: