అల్లుఅరవింద్ కు దొరకని చిరంజీవి ఇండస్ట్రీలో హాట్ హాట్ చర్చలు !

Seetha Sailaja
మెగాస్టార్ చిరంజీవి సినిమా కెరియర్ ను నెంబర్ వన్ స్థానానికి తీసుకుకు వెళ్ళడంలో అల్లు అరవింద్ క్రియాశీలక పాత్ర ఎవరు కాదనలేని సత్యం. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను గీతా ఆర్ట్స్ తో చిరంజీవి చేసాడు.  దీనితో అల్లు అరవింద్ చిరంజీవిల కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే చాలు అప్పట్లో అది గ్యారంటీ హిట్ అన్న అభిప్రాయం ఇండస్ట్రీ వర్గాలలో ఉండేది. 

చిరంజీవి సినిమాలను వదలి రాజకీయాల్లోకి వెళ్లిపోయిన తర్వాత  కూడ వీరిద్దరి సాన్నిహిత్యం కొనసాగింది. చిరంజీవికి తోడుగా రాజకీయాల్లో అల్లు అరవింద్ నడవడమే కాకుండా అప్పటి ఎన్నికలలో   ప్రజారాజ్యంను నిలబెట్టడానికి అరవింద్ చాల శ్రమించాడు. అయితే రాజకీయాలు వదిలి తిరిగి చిరంజీవి మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత వీరిద్దరి మధ్య ఒక చిన్న గ్యాప్ ఏర్పడింది అన్న గాసిప్పులు వచ్చిన విషయం తెలిసిందే. 

ఈ గాసిప్పులకు బలం చేకూర్చే విధంగా ఈమధ్య చిరంజీవి అరవింద్ గీత ఆర్ట్స్ లో సినిమా చేసే విషయంలో వ్యవహరిస్తున్న తీరు అనేక సందేహాలకు తావు ఇస్తోంది అన్న కామెంట్స్ హడావిడి చేస్తున్నాయి. చిరంజీవి 150వ సినిమాను అరవింద్ నిర్మించాలని ప్రయత్నిస్తే అది కొణిదెల ప్రొడక్షన్స్ పై చరణ్ నిర్మించాడు. 

ఆ తరువాత చిరంజీవి 151వ సినిమాగా ప్రస్తుతం నిర్మించబడుతున్న ‘సైరా’ ను అరవింద్ తన బ్యానర్ లో నిర్మించాలి అను కుంటే ఆసినిమాకు కూడ రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. దీనితో అరవింద్ ఇక తన ఆశలు అన్నీ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో వచ్చే ఏడాది నటించబోయే సినిమా పై పెట్టుకుంటే ఆసినిమాకు కూడ నిర్మాతగా చరణ్ వ్యవహరించడం ఖాయం అని అంటున్నారు. దీనితో చిరంజీవి తన గీత ఆర్ట్స్ లో ఎప్పుడు చిరంజీవితో సినిమా తీస్తాడో అతడికే తెలియని పరిస్థితి అంటూ సెటైర్లు పడుతున్నాయి..   



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: