దర్శకుడికి క్షమాపణలు చెప్పిన నటి!

siri Madhukar
భారత దేశంలో ఈ మద్య ‘మీ టూ’ఉద్యమం బాగా ఊపందుకుంది.  ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న కాస్టింగ్ కౌచ్, లైంగిక వేదింపులపై కొంత మంది హీరోయిన్లు  నోరు విప్పడంతో ‘మీ టూ’ ఉద్యమం తీవ్ర స్థాయిలో చేరుకుంది.   బాలీవుడ్ లో తనూశ్రీ దత్తా, కంగనా రౌనత్ లు గతంలో తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి సంచలన వ్యాఖ్యలు చేయడం..వారికి ఇతర హీరోలు, హీరోయిన్లు మద్దతు ఇవ్వడం జరిగింది.  దక్షిణాదిలో సింగర్ చిన్మయి ‘మీ టూ’ఉద్యమంలో భాగంగా నిలిచింది.  ఆ మద్య దర్శకుడు రవి శ్రీవాస్తవ తనను లైంగికంగా వేధించాడంటూ ఆరోపించి కలకలం రేపిన నటి సంజన గల్రాని మంగళవారం క్షమాపణలు చెప్పింది. 


సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది యువతులు హీరోయిన్లు కావాలని బంగారు కలలు కని వస్తారని..అలాంటి వారిని కొంత మంది దళారులు దారుణంగా మోసం చేస్తున్నారని ఆరోపించింది.  తాను కూడా  కలలతో రంగుల ప్రపంచంలో అడుగుపెట్టిన తాను తన మొదటి చిత్రం ‘గండ-హెండతి’ చిత్రీకరణ సమయంలో వేధింపులు ఎదుర్కొన్నానని ఆరోపించింది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో  తాను చిన్న పిల్లని కావడంతో తన అవసరాన్ని కొంత మంది దారుణంగా వాడుకున్నారని..శాండల్‌వుడ్‌లో తనకు భయానక అనుభవాలు ఎదురయ్యాయని, ముద్దు సీన్లతోపాటు తన శరీరాన్ని అసభ్యంగా చిత్రీకరించారని వాపోయింది.

ఎక్కడపడితే అక్కడ కెమెరాలు పెట్టి అసభ్యంగా చిత్రీకరించారని ఆవేదన వ్యక్తం చేసింది. అందుకు తాను వ్యతిరేకిస్తే ఇండస్ట్రీలో భవిష్యత్తు లేకుండా చేస్తానని హెచ్చరించారని ఆరోపించింది.  అప్పట్లో భయంతో తాను ఎవరికీ చెప్పకుండా మనసులో దాచుకొని కుమిలిపోయానని సంచలన ఆరోపణలు చేసింది. అయితే సంజన చేసిన ఆరోపణలు కన్నడ దర్శకుల సంఘం ఖండించింది. 

సినిమాల్లో చాన్స్ వచ్చే వరకు ఒకలా..తీరా వచ్చిన తర్వాత మరోలా ప్రవర్తించడం మంచిది కాదని..సంజన అసత్య ఆరోపణలు చేస్తోందని పేర్కొంది. అంతే కాదు ఆమె బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని..అప్పటి కన్నడ సినిమాల్లో ఆమెకు అవకాశం కల్పించబోమని తేల్చి చెప్పింది.  దాంతో మెట్టు దిగిన సంజన దర్శకుడు శ్రీవాత్సవ, దర్శకుల సంఘం అధ్యక్షుడు నాగేంద్ర ప్రసాద్‌, సంఘం పథాధికారులకు ఆమె బేషరతుగా క్షమాపణ చెప్పింది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: