విజయదేవర కొండ ముద్దులు చూసి భయపడిన శ్రీదేవి కూతురు.... అందుకే నో...!

Prathap Kaluva

విజయదేవరకొండ ఎటువంటి సినిమా నేపధ్యం లేకుండా వచ్చి స్టార్ హీరోల రేంజ్ కు ఎదిగి పోయాడు. అర్జున్ రెడ్డి సినిమాతో సౌత్ లో ఒక అలజడి రేపాడు. తరువాత గీత గోవిందం సినిమాతో వంద కోట్ల క్లబ్ లోకి చేరిపోయాడు. అయితే  అలాంటి హీరోతో నటించడానికి చాలామంది పోటీ పడుతున్నారు. కానీ ఒక హీరోయిన్ మాత్రం విజయ్ దేవరకొండ పేరు చెబితే దణ్ణం పెట్టేస్తుంది. 


 ఆ హీరోయిన్ ఎవరో కాదు దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాహ్నవి. బాలీవుడ్‌లో ఒక సినిమా ఆఫర్ వచ్చింది విజయ్ దేవరకొండకు. హీరోయిన్‌గా జాహ్నవిని తీసుకోవాలనుకున్నారు. అయితే విజయ్ పేరు చెప్పగానే జాహ్నవి నేను అస్సలు నటించనని చెప్పేసిందట. అందుకు కారణం దర్శకుడు కరణ్‌ జోహార్ అని తెలుస్తోంది. ప్రస్తుతం కరణ్‌ జోహార్ దర్శకత్వం వహిస్తున్న రెండు సినిమాల్లో నటిస్తోందట జాహ్నవి. అందుకే బిజీబిజీగా ఉంటోందట. దీంతో ప్రస్తుతం సినిమాలను ఒప్పుకోనని చెబుతోందట. 


 అయితే అర్జున్ రెడ్డి సినిమాలో ముద్దులతో ముంచెత్తిన అర్జున్ రెడ్డి సినిమాను జాహ్నవి చూసిందట. అందుకే ఆ హీరోతో నటించనని తెగేసి చెప్పేస్తోందట. విజయ్ దేవరకొండతో సినిమా చేయనని జాహ్నవి చెప్పడంతో తెలుగు సినిమా పరిశ్రమలో ఇదే విషయం హాట్ టాపిక్‌గా మారుతోంది. అయితే బాలీవుడ్ హీరోయిన్స్ తెలుగు లో ఒప్పుకోవడం చాలా కష్ట మని చెప్పొచ్చు. ఎందుకంటే టాలీవుడ్ ను తక్కువగా చూడటమే. అయితే బాహుబలి తరువాత ఆ అభిప్రాయం మారిందనుకోండి... రాజమౌళి లాంటి డైరెక్టర్ అడిగితే ఎవరు నో చెప్పే సాహసం చేయకపోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: