షాకింగ్ తెలంగాణా ఎన్నికలలో నోటా ను ప్రమోట్ చేస్తున్న విజయ్ దేవరకొండ !

Seetha Sailaja
విజయ్ దేవరకొండకు తెలంగాణ మంత్రి కేటిఆర్ కు స్నేహంతో పాటు బంధుత్వం కూడ ఉన్న విషయం ఓపెన్ సీక్రెట్. దీనితో విజయ్ దేవరకొండ తెలంగాణాలో టిఆర్ఎస్ కు మద్దతుగా ప్రచారం చేస్తాడా అంటూ అందరు ఊహిస్తూ ఉంటే దానికి భిన్నంగా విజయ్ రాబోతున్న ఎన్నికలలో ప్రతి ఒక్కరు ఓటు వేయాలని పిలుపు ఇస్తూ ఎన్నికలలో పోటీచేస్తున్న పార్టీ అభ్యర్ధులు నచ్చకపోతే కనీసం ‘నోటా’ బటన్ పైన అయినా క్లిక్ చేసి తమ ఓటును సద్వినియోగ పరుచుకోండి అంటూ పిలుపు ఇచ్చాడు.

రేపు విడుదల కాబోతున్న ‘టాక్సీవాలా’ సినిమాను ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్ చేసాడు. అంతేకాదు నేటి యువతరం ఓటు విలువ గుర్తించడం లేదని అందువల్ల ఓటు వేయకపోవడమే ఒక ఫ్యాషన్ అనుకుంటున్నారని దీనివల్ల వారు వేయని ఓట్లు దొంగ ఓట్లుగా మారుతున్నాయి అన్న వాస్తవాన్ని నేటితరం గుర్తించడం లేదు అంటూ ప్రజలకు ఓటింగ్ విషయంలో అవగాహన కలిగిస్తున్నాడు విజయ్ దేవరకొండ. 

ఇదే సందర్భంలో తన ‘టాక్సీవాలా’ గురించి మాట్లాడుతూ తన గురించి అదేవిధంగా తన సినిమాల గురించి ఎవరైనా నెగిటివ్ ప్రచారం చేస్తే తనకు ఎంతో ఆనందం కలుగుతుందని దీనికికారణం తాను వారి దృష్టిలో అంత ఎదిగిపోయాను అన్న విషయం తనకు స్పష్టంగా తెలుస్తోంది అంటూ కామెంట్ చేసాడు. చిరంజీవి సినిమాలను చూస్తూ పెరిగిన తాను తన పై చిరంజీవి ప్రశంసలు కురిపిస్తాడు అని కలలో కూడ అనుకోలేదని ఈ విషయాలన్నీ తనకు ఒక కలలా కనిపిస్తున్నాయి అని అభిప్రాయాపడుతున్నాడు అర్జున్ రెడ్డి. 

ఇప్పటి వరకు కొత్త దర్శకులతో సినిమాలు చేసిన తాను వచ్చే ఏడాది ఒక అగ్ర దర్శకుడుహో తన సొంత నిర్మాణ సంస్థలో సినిమా చేయబోతున్న విషయాలను లీకులు ఇస్తూ భవిష్యత్ లో తాను నిర్మాతగా మారబోతున్న సంకేతాలు ఇచ్చాడు. అంతేకాదు ఎవరు ఎన్ని నెగిటివ్ ప్రచారాలు చేసినా ‘టాక్సీవాలా’ సూపర్ హిట్ అవుతుందని వచ్చే ఏడాది నుంచి కనీసం ఏడాదికి రెండు సినిమాలు ఉండేలా తన ప్లాన్ ఉంటుందని చెపుతూ ‘నోటా’ తో తన అభిమానులకు నిరుత్సాహ పరిచిన బాకీ ‘టాక్సీవాలా’ తో తీర్చివేయబోతున్నాను అంటూ మరొకసారి తన ఇగోను ప్రదర్శిస్తున్నాడు విజయ్ దేవరకొండ..  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: