సన్నీ లియోన్ స్టెప్స్ - సిల్వర్ స్క్రీన్ షేక్స్

ఎన్టిఆర్ సినిమా టెంపర్ - టాలీవుడ్ దుమ్ముదులిపెసి ఎన్టిఆర్ ను రిపొజిషన్ చేసిన సంచలన చిత్రం. దీన్ని తమిళంలో విశాల్ కథానాయకుడుగా రిమేక్ చేస్తున్నారు. 
మామూలుగా సన్నీ లియోన్‌ స్పెషల్‌ సాంగ్‌ కి డ్యాన్స్‌ వేస్తే, సినిమాకు అంతు లేని క్రేజ్‌ ఏర్పడుతుంది. "సన్నీ స్టెప్పేస్తే సిల్వర్‌ స్క్రీన్‌ షేక్‌" ఖాయం.

ఇప్పటికే బాలీవుడ్ లో   "పింక్‌ లిప్స్, లైలా మే లైలా" వంటి ప్రతిష్ఠాత్మక స్పెషల్‌ సాంగ్స్‌ తో ఒక ఊపు ఊపేసి, తెలుగులో రాజశేఖర్‌ "పీయస్‌వీ-గరుడవేగ" చిత్రంలో "డియో డియో.." వంటి సాంగ్‌తో సన్నీ లియోన్‌ ఎంతటి "సెన్సేషన్‌" సృష్టించారో తెలిసిందే.  ఇప్పుడు అదే క్రేజ్‌ తమ సినిమాకి తోడవ్వాలనుకుంటున్నారు "అయోగ్య" చిత్ర బృందం. తెలుగు సూపర్‌ హిట్‌ చిత్రం "టెంపర్‌" ను హీరో విశాల్‌ తమిళంలో "అయోగ్య" పేరుతో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.

రాశీ ఖన్నా కథానాయిక. ఏఆర్‌ మురుగదాస్‌ శిష్యుడు వెంకట్‌ మోహన్‌ దర్శకుడు. ఈ సినిమాలో ఒక స్పెషల్‌ సాంగ్‌ కోసం చిత్ర బృందం సన్నీ లియోన్‌ని సంప్రదించారట. "టెంపర్‌" లో "ఇట్టాగే రెచ్చిపోదాం పిల్లా...." అనే సాంగ్‌కు "నోరా ఫతేహి" స్టెప్స్‌ వేశారు. ఇప్పుడు ఈ ఐటమ్‌ సాంగ్‌ కే తమిళంలో సన్నీ లియోన్‌ స్టెప్పులు వేయనున్నారట. ఈ చిత్రం ఫస్ట్‌-లుక్‌ సోమవారం రిలీజ్‌ కానుందని సమాచారం. ఈ చిత్రాన్మి ‘ఠాగూర్‌’ మధు నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రం రిలీజ్‌ కానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: