‘బాహుబలి 2’ రికార్డులకు ‘2.ఒ’చెక్!

siri Madhukar
‘బాహుబలి 2: ది కన్‌క్లూజన్’ సినిమా తరవాత అన్నీ నాన్-బాహుబలి రికార్డులే అయిపోయాయి.   బడ్జెట్ లో అయినా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ లో అయినా.. అదే విధంగా కంటెంట్ లో అయినా బాలీవుడ్ కి తీసిపోని విధంగా బాహుబలి, బాహుబలి 2 సినిమా ఎన్నో రికార్డులు బ్రేక్ చేసింది. ఇప్పుడు ‘బాహుబలి 2’కు రజినీకాంత్ ‘2.0’ చెక్ పెడుతోంది. విడుదలకు ముందే రికార్డుల రేసును మొదలుపెడుతోంది.  'బాహుబలి' రెండో భాగాన్ని ప్రపంచవ్యాప్తంగా 6,500 థియేటర్లలో విడుదల చేయగా, '2.ఓ' 6,800 థియేటర్లలో విడుదల కానుంది.

రూ.543 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మితమైన ‘2.0’ విడుదలకు ముందే ‘బాహుబలి 2’ రికార్డులను చెరపడం మొదలుపెట్టింది. 3డీ టెక్నాలజీ, 4డీ సౌండ్ తో విడుదల కానున్న ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త విందు అందించడం ఖాయమని నిర్మాతలు చెబుతున్నారు.  ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10వేల స్క్రీన్లలో ‘2.0’ ప్రదర్శితమవనుంది. ‘బాహుబలి 2’ ప్రపంచ వ్యాప్తంగా 9వేల థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్, అక్షయ్ కుమార్ తదితరులు నటించగా, శంకర్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అయితే 1200 నుంచి 1250 థియేటర్లలో ‘2.0’ విడుదలవుతోంది. తమిళనాడులో 625 థియేటర్లలో రిలీజ్ అవుతోన్న ‘2.0’.. కర్ణాటకలో 300 థియేటర్లలో ప్రదర్శితమవనుంది.సెన్సార్ బోర్డు నుంచి ‘యు/ఎ’ సర్టిఫికెట్ పొందిన ‘2.0’ రన్ టైమ్ కూడా 2 గంటల 28 నిమిషాలు మాత్రమే.  ఇదిలా ఉంటే, ‘2.0’ విడుదలకు ముందే దాదాపు రూ.120 కోట్ల బిజినెస్ చేసేసింది.

తమిళ సినీ పరిశ్రమలో విడుదలకు ముందే రూ.100 కోట్లు వసూలు చేసిన తొలి సినిమాగా ‘2.0’ రికార్డుకెక్కింది.  మరి నవంబర్ 29న రిలీజ్ కానున్న శంకర్ 2.0 ఏ రేంజ్ లో హిట్టవుతుందో చూడాలి. 3డి టెక్నాలజీ, 4డి సౌండ్ ఎఫెక్ట్‌తో వస్తోన్న ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: