మోహన్ లాల్ అనవసరంగా తలనొప్పి తెచ్చుకుంటున్నాడు !

KSK
సౌత్ ఇండియా ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ క్రేజ్ ఏర్పరుచుకున్న సూపర్ స్టార్ హీరోలలో ఒకరు మోహన్ లాల్. అయితే ఇటీవల మోహన్ లాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తు వార్తల్లో నిలుస్తున్న మోహన్ లాల్ తాజాగా ఆయన సోషల్ మీడియాలో రాజకీయరంగంలో సినిమా రంగంలో సంచలనం సృష్టిస్తున్న మీటూ పై చేసిన వ్యాఖ్యలు ఆయనకు కొత్త తలనొప్పులు తెచ్చి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.

గతంలో దిలీప్ అనే నటుడు లైంగిక వేధింపుల కేసుల విషయంలో అడ్డంగా బుక్ అయిన సంగతి వార్తల్లో వచ్చినా కానీ దిలీప్ ని  సంఘం నుండి బహిష్కరించకుండ చాలా విధాల ఆదుకుందమని మోహన్ లాల్ శతవిధాల ప్రయత్నాలు చేసిన..ఆ సమయంలో ఆర్టిస్టుల రాజీనామాలతో వెనక్కి తగ్గారు మోహన్ లాల్.

ఈ క్రమంలో తాజాగా మోహన్ లాల్  మీటూ ఫ్యాషన్ లాంటిదని కొన్ని రోజులు అయ్యాక అందరు మర్చిపోయి సర్దుకుంటారని చేసిన కామెంట్స్ మీద అక్కడి నటీమణులు భగ్గుమంటున్నారు. తమిళ సీనియర్ నటి రేవతి లాంటి వాళ్ళు మోహన్ లాల్ పేరు ప్రస్తావించకుండా ఇలా చులకన చేయడం గురించి మండిపడుతున్నారు.

లాల్ తన మాటలను వెనక్కు తీసుకున్నా కూడా ఒక్కసారి నోరు జారాక ఫలితం ఎలా ఉంటుందో తెలిసిందే కదా అంటూ సెటైర్లు వేశారు. దీంతో చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియాలో మోహన్ లాల్ అనవసరమైన విషయాలలో వేలు పెట్టి మరీ విమర్శలు చేయించుకోవడం మోహన్ లాల్ కి ఆనందం అనుకుంటా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: