'మీటూ'లో అందుకే నా పేరు లేదు! : రాంగోపాల్ వర్మ

Edari Rama Krishna
ఈ మద్య భారత దేశంలో ఎక్కడ చూసినా ‘మీ టూ ’పైనే చర్చలు నడుస్తున్నాయి.  హాలీవుడ్ లో మొదలైన మీ టూ ఉద్యమం బాలీవుడ్ కి పాకింది. బాలీవుడ్ లో తనూశ్రీ దత్తా ప్రముఖ నటుడు నానా పటేకర్, కొరియోగ్రాఫర్, డైరెక్టర్ తనను లైంగికంగా వేధించారని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.  ఆమె ఆరోపణలతో బాలీవుడ్ లో ప్రకంపణలు మొదలయ్యాయి. తర్వాత బాలీవుడ్ క్వీన్ కంగనా రౌనత్ సైతం తనపై లైంగిక వేధింపులు జరిగాయని ఆరోపణ చేసింది. ఆమెతో పాటు పలువురు నటీమణులు గతంలో తమపై జరిగిన అకృత్యాలు వెల్లడించారు. 

దక్షిణాదిన ‘మీ టూ’ఉద్యమం నేపథ్యంలో ప్రముఖ సింగర్ చిన్మయి ప్రముఖ రచయిత వైర ముత్తు తనపై లైంగిక వేధింపులు చేశారంటూ సంచలన ప్రకటన చేసింది.   'మీటూ' ఉద్యమం సాగుతూ, సినీ పరిశ్రమలోని పలువురు ప్రముఖుల రాసలీలలు, అవకాశాలు ఇస్తామని అందుకు తమ పడక సుఖం ఇవ్వాలని కోరిన వారి భాగోతాలు బయట పడుతున్నాయి.  అయితే ఇప్పటి వరకు ‘మీ టూ’ఉద్యమంలో తన పేరు రాకపోవడం తనకెంతో ఆశ్చర్యాన్ని కలిగించిందని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నాడు.

తన సమర్పణలో విడుదలకు సిద్ధమైన 'భైరవగీత' ప్రమోషనల్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న వర్మ, మీడియాతో మాట్లాడాడు. నేను నిద్ర లేవగానే ఆడవాళ్ల తొడలు చూసే రకం అని సంచలన వ్యాఖ్యలు చేసాడు. అమ్మాయిల తోడు, మందు, మూవీస్ ఇదే నా జీవితం అంటూ పలుమార్లు ప్రకటించిన వర్మ తాజాగా భైరవగీత చిత్రం కోసం ప్రచారంలో పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. నన్ను అలాంటి వాడు, ఇలాంటి వాడని అంటుంటారు. 'మీటూ'లో ఎంతోమంది పేర్లు వచ్చాయి. నా పేరు మాత్రం బయటకు రాలేదు. జీఎస్టీ వంటి చిత్రాలు చేస్తుంటే నా గురించి ఇక ఏం చెబుతారు?" అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించాడు రామ్ గోపాల్ వర్మ.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: