ప్రముఖ బాలీవుడ్ సింగర్ కన్నుమూత!

Edari Rama Krishna

మూడున్నర దశాబ్దాలపాటు ఎన్నో అద్భుతమైన పాటలు పాడి ప్రేక్షకులను అలరించిన ప్రముఖ గాయకులు మహ్మద్ అజీజ్ (64)ఇవాళ కన్నుమూశారు. మహ్మద్ అజీజ్ నానావతి ఆస్పత్రిలో మధ్యాహ్నం 3.17 గంటలకు తుదిశ్వాస విడిచారు. కోల్‌కత్తా నుంచి వస్తుండగా కార్డియాక్ అరెస్ట్ అయిన ఆయనను విమానం ల్యాండ్ అయిన వెంటనే సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.  మహ్మద్ అజీజ్ 80,90లలో అమితాబ్ బచ్చన్, గోవిందా, రిషికపూర్ వంటి స్టార్లకు సూపర్‌హిట్ పాటలను పాడాడు. జానీ లెవర్ సోదరు జిమ్మీ మోసెస్ తన ఫేస్‌బుక్ పోస్టుతో ఈ విషాదాన్ని అభిమానులకు తెలిపాడు.


‘మై నేమ్ ఈజ్ లకన్’ లాంటి ఫేమస్ సాంగ్స్ పాడిన అజీజ్.. హిందీ, బెంగాలీ, ఒరియా భాషలలో వేల సంఖ్యలో పాటలు పాడారు. అజీజ్‌‌కు లెజెండరీ సింగర్ మహ్మద్ రఫీ అంటే ప్రాణం.   1984లో వచ్చిన ‘జ్యోతి’ అనే బెంగాలీ సినిమాలో అజీజ్ సింగర్‌ కెరీర్ ప్రారంభించారు.


అప్పటి నుంచి ఆయన కెరీర్లో ఎన్నో అద్భుతమైన పాటలు పాడే అవకాశం లభించింది. మూడున్నర దశాబ్దాలపాటు సింగర్‌గా సేవలందించిన అజీజ్ ఇకలేరన్న విషయాన్ని బాలీవుడ్, బెంగాలీ, ఒరియా ఫిల్మ్ ఇండస్ట్రీలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఆయన మృతిపట్ల సంతాపం ప్రకటించాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: