థియేటర్లో దుమ్మురేపుతున్న ‘2.ఒ’

frame థియేటర్లో దుమ్మురేపుతున్న ‘2.ఒ’

Edari Rama Krishna
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో ‘రోబో’చిత్రం భారీ కలెక్షన్లతో సెన్సేషన్ క్రియేట్ చేసింది.  ఈ చిత్రంలో చిట్టి రోబో చేసే విన్యాసాలు...ఐశ్వర్య అందాలు, గ్రాఫిక్స్ భారతీయ చలన చిత్ర సీమలోనే సంచలనం సృష్టించింది.  చాలా కాలం తర్వాత ఈ చిత్రం సీక్వెల్ ‘2.ఒ’గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత కొంత కాలంగా ఫెయిల్యూర్స్ తో సతమతమవుతున్న రజినీకాంత్ మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నారు.  సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా శంకర్ డైరెక్ట్ చేసిన చిత్రం  '2.0' ఎట్టకేలకు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Image result for 2.0 movie

గత నెల రోజుల నుంచి ఈ చిత్రంపై విపరీతమైన హైక్ తీసుకు వచ్చారు చిత్ర యూనిట్.  ఇక తమిళ నాట ఫ్యాన్స్ సందడి మామూలుగా లేదు. రెండు రోజలు ముందు నుంచే థియేటర్ల వద్ద భారీ ఎత్తున మోహరించి హంగామా చేస్తున్నారు. పెద్ద పెద్ద కటౌట్స్ పెట్టి సంబరాలు చేసుకుంటున్నారు. డాన్సులు, డప్పుల మోతతో థియేటర్ల వద్ద హంగామా సృష్టించారు.

Image result for 2.0 movie

ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం భారీగా వచ్చిన అభిమానుల కోసం థియేటర్ల వద్ద ప్రత్యేక ఏర్పాటు చేశారు.  రజినీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయితే..నిన్నరాత్రి నుంచే థియేటర్ల వద్ద బారులు తీరారు. రజినీకాంత్ మాస్క్ లను ధరించి సినిమా చూస్తూ తెగ సంబరపడిపోయారు అభిమానులు. ఇక ఫ్యాన్స్ తో పాటు సెలబ్రిటీలు సైతం ఈ సినిమా గురించి మాట్లాడుతూ ట్విట్టర్ మొత్తం 2.0 సందేశాలతో నింపేశారు. 
ராஜாளி செம ஜாலி, இன்னிக்கு எங்களுக்கு தீவாளி...💥😍 #2Point0CelebrationBegins pic.twitter.com/sU3bYg0Io1

— Rajinifans.com (@rajinifans) November 28, 2018 Rajinifans team inside Rohini now 🔥🔥 pic.twitter.com/gbTgYoQSOZ

— Rajinifans.com (@rajinifans) November 28, 2018 #2Point0FDFS @RohiniSilverScr !! pic.twitter.com/dF6PhRfh1c

— Nikilesh Surya (@NikileshSurya) November 28, 2018

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: