‘కేదారినాథ్’మూవీని నిషేదించాలి..గుజరాత్‌ హైకోర్టులో వ్యాజ్యం!

Edari Rama Krishna
2013లో కేదార్‌నాథ్‌ను ముంచెత్తిన భారీ వరదల నేపథ్యంతో ప్రేమకథా గా 'కేదార్‌నాథ్‌'  చిత్రాన్ని రూపొందించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్లో వరద విషాదంతో పాటు హీరో హీరోయిన్ ముద్దు సీన్లు కూడా చూపించారు. ఈ ట్రైలర్ విడుదల తర్వాత ఆందోళనలు మొదలయ్యాయి.  ఈ చిత్రాన్ని నిషేధించాలని గుజరాజ్‌ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఇంటర్నేషనల్‌ హిందూ సేన ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. వచ్చే వారం విచారణకు రానుంది. 
ఈ చిత్రం డిసెంబర్‌ ఏడో తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది.   

పవిత్రమైన కేదార్‌నాథ్ పుణ్యక్షేత్రం పరిసరాల్లో వల్గర్ డాన్సులు చేసినట్లు చిత్రంలో చూపించబోతున్నరని, దీన్ని మేము ఎంత మాత్రం అంగీకరించబోము అంటున్నారు.  కేదార్‌నాథ్‌ పూజారులు ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలకు అభ్యంతరం చెబుతూ ఈ చిత్రాన్ని నిషేధించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 


హిందువులకు పరిత్రమైన ఈ కేదార్‌నాథ్‌లో ముస్లిమ్‌కు, హిందువుకు ప్రేమాయణంపై చిత్రాలు తీయడమేమిటని, అదీ వరదలు వచ్చి నానా అల్లకల్లోలం ఏర్పడితే ఆ ఆంశాన్ని విస్మరించి హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ చిత్రం రూపొందించారని ఆ పూజార్ల ప్రధాన ఆరోపణ. 

అంతే కాదు ఈ చిత్రం కథ జిహాద్‌ను ప్రమోట్‌ చేస్తున్నట్టు ఉందని చెబుతున్నారు. ఈ చిత్రం రిలీజ్ తాము ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ చిత్రానికి అభిషేక్‌ కపూర్‌ దర్శకత్వం వహించారు. రొన్నీ ఈ చిత్రాన్ని నిర్మించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: