మరో మేజిక్ డేట్ ను ఫిక్స్ చేసిన జక్కన్న!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో దర్శకధీరుడు రాజమౌళి ఏది చేసినా సెన్సెషన్ అవుతుందన్న విషయం తెలిసిందే.  బుల్లితెరపై ఆయన ప్రస్థానం మొదలైనప్పటికీ ఎన్టీఆర్ నటించిన ‘స్టూడెంట్ నెం.1’ చిత్రంతో దర్శకుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు.  అప్పటి నుంచి ఏ ఒక్క ఓటమి లేకుండా జైత్ర యాత్ర కొనసాగిస్తున్నారు రాజమౌళి.  ఇండస్ట్రీలో అందరూ ఆయనను జక్కన్న అంటూ ముద్దుగా పిలుస్తారు.  బాహబలి2 చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న రాజమౌళి తెలుగు ఇండస్ట్రీలో మరో వండర్ క్రియేట్ చేసేందుకు సిద్దం అవుతున్నారు. 

వరుస హిట్స్ తో దుమ్మురేపుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆ, ఈ మద్య రంగస్థలం చిత్రంతో రెండు కోట్ల క్లబ్ లో చేరిన మెగాపవర్ స్టార్ రాంచరణ్ మల్టీస్టారర్ గా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.  ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ మొదలైంది.  రాజమౌళి తన మల్టీ స్టారర్ మూవీకి సంబంధించిన అన్ని పనులను పూర్తి చేసుకుని, ఆ ప్రాజెక్టును లాంచ్ చేయడానికి 11-11-11 అనే మేజిక్ డేట్ ను ఫిక్స్ చేసుకున్నారు. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం నవంబర్ 11వ తేదీన ఉదయం 11 గంటలకు ఆయన ఈ సినిమాను లాంచ్ చేశారు.   

ఇప్పుడు మరో మేజిక్ డేట్ ఫిక్స్ చేయబోతున్నట్లు ఫిలిమ్ వర్గాల టాక్.   తన టీమ్ తో కలిసి 12-12-12  ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అన్ని విషయాలను గురించి లాంచింగ్ రోజునే చెప్పబోతున్నట్లు ప్రకటించారు రాజమౌళి. మొత్తానికి 12-12-12 అంటూ మరో మేజిక్ డేట్ ఫిక్స్ చేశారు. ఈ మేజిక్ డేట్ లో కథానాయికలు ఎవరనే విషయాన్ని ఆయన ప్రకటించవచ్చనే టాక్ వినిపిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: