'2.0'మూవీ పక్షిరాజు స్ఫూర్తి ఎవరో తెలుసా!

Edari Rama Krishna
ప్రపంచంలో టెక్నాలజీ ఎంత పెరుగుతుందో..మనిషి, పశుపక్ష్యాదుల వినాశనం కూడా అదే రేంజ్ లో కొనసాగుతుంది. ముఖ్యంగా సెల్ ఫోన్ వచ్చినప్పటి నుంచి ఈ వినాశనం ఎక్కువ అవతుందని కళ్లకు కట్టినట్లు  దర్శకుడు శంకర్ రూపొందించిన '2.0' చిత్రంలో చూపించారు.  ఇక '2.0' సినిమాలో అక్షయ్ కుమార్ పక్షిరాజు పాత్రలో ఒదిగిపోయాడు. రేడియేషన్ కారణంగా పక్షులు చనిపోతున్నాయని వాటిని కాపాడండి అంటూ అక్షయ్ కుమార్ పాత్ర ద్వారా చెప్పే ప్రయత్నం చేశాడు.  ‘పక్షుల్ని బతికించండి... భూమిని కాపాడండి’ అంటూ '2.0'  చిత్రంలో అక్షయ్‌ కుమార్‌ పక్షిరాజు పాత్రకు ప్రాణం పోశాడు. 

అంతగా ఆకట్టుకున్న ఈ పాత్రకు స్ఫూర్తి ఎవరో తెలుసా? ఆయన మరెవరో కాదు.. ఆర్నిథాలజీ నిపుణుడు, పర్యావరణ వేత్త సలీం అలీ.  అవును, ఆ మహనీయుడి జీవితంలోని కొన్ని అంశాల ఆధారంగానే ‘పక్షిరాజు’ఆవిష్కృతమయ్యాడు.  'బర్డ్ మ్యాన్ ఆఫ్ ది ఇండియా' పేరుతో ప్రఖ్యాతి గాంచిన సలీం అలీ పక్షుల కోసం ఎంతగానో పాటుపడ్డారు.  రాజస్థాన్‌లోని భరత్‌పురాలో దేశంలోనే తొలి పక్షుల అభయారణ్యం నెలకొల్పారు.

బాంబే నేచురల్‌ హిస్టరీ సొసైటీ ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించారు. పక్షుల జీవనాన్ని చెప్పే ఎన్నో అద్భుతమైన పుస్తకాల్ని రాశారు.  సలీం అలీ అందించిన సేవలకుగాను భారత ప్రభుత్వం పద్మభూషణ్‌, పద్మవిభూషణ్‌ పురస్కారాలతో గౌరవించింది. జూన్‌ 20, 1987లో సలీం అలీ తుది శ్వాస విడిచారు.

శంకర్ తన సినిమాలో పక్షిరాజు పాత్రకు సలీం అలీనే స్పూర్తిగా తీసుకొని డిజైన్ చేశారట. ఈ విషయాన్ని కథా రచయిత జయమోహన్ చెబుతూ..  మన సాంకేతిక వినియోగ సంస్కృతి కారణంగా ప్రకృతికి జరుగుతున్న కీడుని చూస్తే ఎంత ఆవేశానికి గురవుతారో చూపాలనే పక్షిరాజు పాత్రను సృష్టించామని  అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: