మహానటి సావిత్రి గెటప్ లో అనసూయ సందడి.. యాడ్ కోసం ఈ రేంజ్ లోనా..!

shami
అనసూయ ఏంటి మహానటి సావిత్రి పాత్ర పోశించడం ఏంటి మహానటిలో కీర్తి సురేష్ సావిత్రిగా నటించింది. ఎన్.టి.ఆర్ బయోపిక్ లో నిత్యా మీనన్ సావిత్రమ్మగా కనిపించనుంది. మరి అనసూయ ఎప్పుడు సావిత్రమ్మగా చేసింది అంటే ఓ యాడ్ కోసం చేయాల్సి వచ్చిందట. మాయాబజార్ సినిమాలోని అహనా పెళ్లి అంట పాట లిరిక్స్ కాస్త మార్చి చందన బ్రదర్స్ యాడ్ వచ్చింది.


ఈ యాడ్ లో శశిరేఖగా అనసూయ మెరిసింది. సావిత్రిగా ఆమె ఏమాత్రం సూట్ అవలేదని చెబుతున్నారు. అయితే ఘటోత్కచుడుగా చేసిన మనో మాత్రం మంచి మార్కులు కొట్టేశాడు. ఎటొచ్చి అనసూయ మీద నెగటివ్ ట్రోల్స్ పడుతున్నాయి. ఈమధ్య నెటిజెన్స్ ఎందుకో అనసూయను టార్గెట్ చేస్తున్నారు.


Something which I’ve been super anxious about but also feel super lucky to be the one to do.. #Savitramma #Mahanati 🙏🏻🙇🏻‍♀️!!
The attempt itself is an acheivement for me!! Thank you @chandanabros @YamunaKishore garu for considering me🙏🏻🙏🏻 I will cherish this work forever🥰🙏🏻 pic.twitter.com/PhURdgvoX8

— Anasuya Bharadwaj (@anusuyakhasba) December 3, 2018
ఆమె ఏ చిన్న తప్పు చేసినా దానిపై ఆమెను ఆడేసుకుంటున్నారు. ఈమధ్యనే జబర్దస్త్ రెండు ఎపిసోడ్స్ రాకపోయే సరికి ఆమె స్థానంలో వచ్చిన వర్షిణికి సపోర్ట్ చేస్తూ జబర్దస్త్ లో అనసూయ వద్దంటూ కామెంట్స్ చేశారు. అయితే అనసూయకు ఉన్న క్రేజ్ వేరే అనుకోండి. ప్రయోగం అని చేశారో.. లేక ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేయాలని చేశారో కాని చందన బ్రదర్స్ యాడ్ కాస్త విచిత్రంగానే ఉంది.


చందనా సందడంటా అంటూ అనసూయ, మనోల హంగామా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మరి ఈ యాడ్ ద్వారా చందన బ్రదర్స్ కు ఎంత ఉపయోగం తెలియదు కాని దీని కోసం బాగానే ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం బుల్లితెర మీద యాంకర్ గానే కాదు వరుస సినిమాలతో కూడా బిజీగా మారింది అనసూయ. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: