బాలీవుడ్ హాట్ బ్యూటీపై దాడి!

Edari Rama Krishna
సోఫియా హయత్‌ ఒక ఇండియాలో స్థిరపడిన హాలీవుడ్ నటి...నటి, సింగర్ గా కొనసాగుతున్నారు. భారతీయ టెలివిజన్ లో కొన్ని కార్యక్రమాల్లో మెరిసిన సోఫియా హయత్ మొదటి నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటూ వస్తుంది.   2013లో ఆర్మాన్ కోహ్లీ తనను బిగ్‌బాస్ షోలో కొట్టాడంటూ ఈవిడ ఆరోపించింది. 2014 లో దర్శకుడు అనిల్ గోయల్ చీప్‌గా బిహేవ్ చేస్తున్నాడంటూ ఆరోపించింది.

ఇలా బాలీవుడ్ లో ఎన్నో కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ..హాట్ ఫోటో షూట్స్ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ హల్ చల్ చేస్తుంది. తాజాగా  నటి సోఫియా హయత్ పై లండన్ లో ఓ వ్యక్తి దాడి చేశాడు. దీంతో ఆమెకి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. నేను లండన్ లో ఓ పార్కు లో నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఓ వ్యక్తి మహిళను వేధిస్తున్నాడు.

ఆమెని కొడుతుండటం నేను గమనించి వెంటనే అక్కడకు  వెళ్లి ఆమెని కాపాడే ప్రయత్నం చేశాను. అతన్ని బలంగా పక్కకు నెట్టి వేశాను..కానీ అతడు నాపై కూడా దాడి చేశాడు. వెంటనే పోలీసులకు ఫోన్ చేయడంతో అక్కడ నుంచి పారిపోయాడు. అతడు పారిపోయిన కొద్ది సేపట్లోనే పోలీసులు అతడిని పట్టుకొని జైలులో వేశారు.  నాకు గాయాలు అయినప్పటికీ ఆ మహిళను కాపాడినందుకు సతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది. 
Ex Bigg Boss contestant Sofia Hayat @sofiahayat abused at a park in London for preventing another woman from getting hurt#SofiaHayat #London #violenceagainstwomen https://t.co/hW15rhuM5h

— MyNation (@MyNation) December 11, 2018

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: