హాట్ సిల్క్‌ స్మిత కోసం: కృష్ణ, బాబూ మోహన్.. హోరాహోరీ..?

Chakravarthi Kalyan

సినిమాకు దర్శకుడే కెప్టెన్.. ఇది చాలా రొటీన్ డైలాగ్.. కానీ అదే స్టార్ హీరో సినిమాకు ఈ సూత్రం అప్లయ్ కాదు. ఇప్పుడంటే కాస్త దర్శకులకు విలువ ఇస్తున్నారు కానీ.. గతంలో చాలా వరకూ హీరోయే సినిమాకు మూలస్థంభంలా ఉండేవారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణల కాలంలో హీరోలు ఎంత చెబితే అంత.



హీరో, డైరెక్టర్ ఇద్దరూ తమ తమ పరిధుల్లో ఉంటే ఫర్వాలేదు. కానీ ఆ గీత దాటితే.. అదే జరిగింది తమ్మారెడ్డి భరద్వాజ విషయంలో.. ఆయన కృష్ణ హీరోగా రౌడీ అన్నయ్య సినిమా డైరెక్ట్ చేసేటప్పుడు ఓ తమాషా సన్నివేశం జరిగిందట. ఈ సినిమాలో సందర్భానుసారం సిల్క్ స్మితతో విలన్ క్యారెక్టర్ బాబూ మోహన్ కు సాంగ్ ఉందట.



ఐతే.. ఆ సాంగ్‌ బాబూమోహన్‌ తో కాకుండా హీరోనైన తనతోనే ఉండాలని హీరో కృష్ణ పట్టుబట్టారట. కృష్ణ పట్టుదలతో ఉదయం సిల్క్‌ స్మిత, బాబూమోహన్ మీద చిత్రీకరించిన ఆ పాటను మళ్లీ సాయంత్రం కృష్ణ, సిల్క్‌ స్మిత మీద చిత్రీకరించారట. విచిత్రం ఏమిటంటే.. హీరో కృష్ణతో తీసిన పాటను అసలు సినిమాలోనే పెట్టలేదట.



సినిమా విడుదలకు ముందు ఈ విషయం కృష్ణకు తెలిసి పెద్ద గొడవైపోయిందట. కృష్ణ ఫ్యాన్స్ చివరకు తమ్మారెడ్డి భరద్వాజ కార్యాలయంపై దాడి కూడా చేశారట. వారిపై తమ్మారెడ్డి కేసు కూడా పెట్టారట. ఆ తర్వాత మళ్లీ హీరో, దర్శకుడు కాంప్రమైజ్ అయ్యి.. చివరకు కృష్ణ సాంగ్‌నే సినిమాలో ఉంచారట.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: