ఘోరంగా నోరు జారిన పవన్.. ఆడుకుంటున్న లోకేశ్ ఫ్యాన్స్..?

Chakravarthi Kalyan

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రాజకీయ వారసుడు నారా లోకేశ్ కు ఓ చిన్న మైనస్ పాయింట్ ఉంది. ఆయన అప్పుడప్పుడు నోరు జారుతుంటాడు. ప్రసంగాల్లో ఆవేశంతో తప్పులు మాట్లాడతాడు. ఒక్కోసారి ఆ తప్పులు పూర్తిగా ఆయన పరువు తీసేస్తాయి. టీడీపీ పార్టీని ఓడించండంటూ అప్పట్లో లోకేశ్ మాట్లాడిన ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.


అప్పుడే కాదు.. ఆ తర్వాత కూడా చాలాసార్లు లోకేశ్ నోరు జారాడు. పాపం. ఆయనకు నోరు జారే అలవాటు ఉండటంతో మీడియా కూడా ఆయన మాట్లాడేటప్పుడు ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందా అని ఎదురు చూస్తుంటాయి. అవకాశం రావడంతోనే మళ్లీ వేసేశాడు అంటూ వెటకారం చేస్తాయి. ప్రత్యేకించి వైసీపీ, జనసేన కార్యకర్తలు వాటిని వైరల్ చేస్తుంటారు.



ఇప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నోరు జారడంతో లోకేశ్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఆ వీడియో క్లిప్పింగ్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇంతకీ పవన్ ఏమని నోరు జారాడు అంటారా.. ఆయన ఇప్పుడు అమెరికా పర్యటనలో ఉన్నారు. కదా. అక్కడ అభిమానులను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.



ఆ సమయంలో దేశ భక్తి గురించి మాట్లాడుతూ.. భగత్ సింగ్ చిన్నవయస్సులోనే ఆత్మార్పణం చేశారు అనబోయి.. ఆత్మహత్య చేసుకున్నాడు అని అన్నారు. మరి భగత్ సింగ్ వంటి దేశ భక్తులు ఉరిశిక్షకు కూడా వెరవకుండా ప్రాణాలను దేశం కోసం వదిలాడు. అలాంటి భగత్ సింగ్ విషయంలో పవన్ నోరు జారేసరికి టీడీపీ ఫ్యాన్స్ దాన్ని ఎత్తిచూపుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: