బాలయ్యకు వర్మ షాక్.. వెన్నుపోటు సాంగ్ కు గంటల్లోనే లక్షల వ్యూస్..
ఎన్టీఆర్ జీవితంపై రూపుదిద్దుకుంటున్న సినిమాల మధ్య పోరు తీవ్రమైంది. ఓ వైపు బాలయ్య ఎన్టీఆర్ మూవీ ప్రీ రిలీజ్ వేడుక అట్టహాసంగా జరుగుతున్న సమయంలోనే మరోవైపు రామ్ గోపాల్ వర్మ రిలీజ్ చేసిన వెన్నుపోటు పాట కలకలం సృష్టిస్తోంది. ఈ వీడియో రిలీజ్ చేసిన కొన్ని గంటల్లోనే లక్షల కొద్దీ వ్యూస్ సంపాదించింది.
అంతా ఊహించినట్టుగానే ఈ పాటలో వర్మ ఫుల్ డోస్ పెంచేశాడు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు టార్గెట్ గా పాటను రాశారు. పాటలో ఎక్కడా చంద్రబాబు పేరు లేకపోయినా.. విజువల్స్ లో ఆ విషయం బాగా ఎస్టాబ్లిష్ చేశారు. ఆ పాట సాహిత్యం ఒక్కసారి పరిశీలిస్తే.. ఆ విషయం తెలుస్తుంది..
దగా.. దగా.. మోసం...
నమ్మించి.. నమ్మించి.. వెన్నుపోటు పొడిచారు..
వంచించి.. వంచించి.. వెన్నుపోటు పొడిచారు..
కుట్ర.. కుట్ర.. కుట్ర.. హా..
పొంచి పొంచి పగలే ఎత్తి వీళ్లు
కుటిల నీతి విషమునే చిమ్మినారు..
దొంగ ప్రేమ నటనలే చూపి వీళ్లు..
కలియుగాన శకునులై చేరినారు..
దహించెనే దురాగతం.. క్షమించ సాధ్యమా..
కుట్ర.. కుట్ర.. కుట్ర..
అయిన వాళ్లు అక్కర దీరి వదిలివేసినారు
అసలు రంగు బయటపెట్టి కాటువేసినారు..
ఒంటరినే చేసి గుంపుదాడి చేసి..
సొంత గూటి నుంచి కూడా వెలివేసినారు..
కుట్ర.. కుట్ర..కుట్ర..
న్యాయమనే కోటను కాల్చి తగలబెట్టినారు..
నీతికేమో గొయ్యి తీసి పాతిపెట్టినారు..
గోతికాడ నక్కలల్లె మాటువేసి..
ఆత్మగౌరవాన్ని చంపి..ఆహుతిచ్చినారు...
కుట్ర.. కుట్ర.. కుట్ర..
ఈ పాట ఆర్జీవీ యూట్యూబ్ ఛానల్లో కేవలం ఆరు గంటల్లోనే 5 లక్షల వ్యూస్ సంపాదించింది.