నితిన్ తీరు పై తీవ్ర అసహనంలో రష్మిక !

Seetha Sailaja
ప్రస్తుతం టాలీవుడ్ లో సమంత స్థానాన్ని భర్తీ చేయగల ఏకైక నటి అని పేరు తెచ్చుకున్న క్రేజీ బ్యూటీ రష్మికకు విపరీతమైన అవకాశాలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థుతులలో ఆమె యంగ్ హీరో నితిన్ ప్రవర్తిస్తున్న తీరు పై తీవ్ర అసహనంలో  ఉన్నట్లు టాక్. 

నితిన్ కోసం ఆమె కొన్ని అవకాశాలు వదులుకుని అతడికి సహకరిస్తున్నా స్పందించని నితిన్ తీరు రష్మిక కోపానికి గల కారణం అని అంటున్నారు. ఆసక్తికరమైన ఈ న్యూస్ వివరాలలోకి వెళితే ప్రస్తుతం పరాజయాల బాటలో నితిన్ కొనసాగుతున్నా అతడి లేటెస్ట్ మూవీకి రష్మిక డేట్స్ ఇచ్చి సహకరించింది.

దీనికి కారణం దర్శకుడు వెంకీ కుడుముల ‘ఛలో’ సినిమాతో తనకు తెలుగులో మొట్టమొదటి అవకాశం ఇచ్చిన ఈ దర్శకుడు పై రష్మికకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఈ కారణం వల్ల వెంకీ కుడుముల నితిన్ తో తీస్తున్న కొత్త సినిమాకు అడిగిన వెంటనే డేట్స్ ఇచ్చినట్లు సమాచారం. 

అయితే ఈ సినిమాకు సంభందించి  డేట్స్ ఇచ్చి నెలరోజులు అవుతున్నా ఆడేట్స్ నితిన్ ఉపయోగించుకోక లేకపోవడంతో రష్మికకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. నితిన్ ఈ సినిమా కధకు సంబంధించి బాగా మార్పులు చేస్తున్న నేపధ్యంలో రష్మికను ఈ సినిమాకు సంబంధించి వెయిటింగ్ లో పెట్టినట్లు టాక్. దీనితో తన డేట్స్ అన్ని అనవసరంగా ఈ సినిమాకోసం వేస్ట్ అయిపోతున్న పరిస్థితులలో ఈమూవీ ప్రాజెక్ట్ ను వెంటనే మొదలు పెట్టకపోతే తాను ఈమూవీ నుండి తప్పుకుంటానని రష్మిక నితిన్ కు హెచ్చరికలు ఇవ్వడంతో రష్మిక కోపం తీర్చే పనిలో నితిన్ సతమత అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: