పాపం శ్రీమతి ఎన్టీఆర్ (ప్రణీత)

HANUMA HANUMA
 ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణీతకు ఇటీవలే పెళ్ళయింది. కానీ అప్పుడు ఎన్టీఆర్ దమ్ము సినిమా బిజీలోఔట్ డోర్ లలో గడపాల్సి వచ్చింది. ఆ చిత్రం అలా పూర్తయిందో లేదో ఇప్పుడు బాద్షా కోసం విదేశాలు తిరగాల్సి వస్తోంది. మొన్నటి వరకు ఇటలీలోగడిపారు ఎన్టీఆర్. తాజాగా బ్యాంకాక్ లో ఉంటున్నారు షూటింగ్ కోసం. ఈ షెడ్యూల్ వచ్చేనెల 25 వరకు సాగుతుంది. అంటే అన్నాళ్ళు ఎన్టీఆర్ ప్రణీతకు దూరంగా ఉంటారన్నమాట. ఈ షెడ్యూల్ తో 60 శాతం షూటింగ్ పూర్తవుతుందట. అభిమానులు మాత్రం ఈ విషయాన్ని విని చాలా సంతోషపడుతున్నారు. తమ తారక్ బాద్షా బాక్సాఫీసు బొనాంజా కాబోతోందని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: