త్వరలో ప్రధాని మోదీ బయోపిక్..అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న‌!

siri Madhukar

ఈ మద్య బయోపిక్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత పెరిగిపోయింది.  సినీ, వ్యాపార, రాజకీయ, క్రీడా రంగాల్లో అత్యద్భుతమైన ప్రతిభ కనబరిచిన వారికి జీవితాలకు సంబంధించిన కథలో సినిమాలు తెరకెక్కుతున్నాయి.  ఇప్పటికే మహానటి, సంజు, ఎం.ఎస్.ధోనీ బయోపిక్ సినిమాలు వచ్చాయి.  ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్, వైఎస్సార్ జీవిత కథ ఆధారంగా ‘యాత్ర’ రాబోతున్నాయి. త్వరలో తమిళ నాట రాజకీయాల్లో ఎన్నో సంచలనాలు సృష్టించిన దివంగత మాజీ  ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ తీసేందుకు రంగం సిద్దం అవుతుంది.


ఇక  మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రధానిగా దారి తీసిన పరిస్థితులపై ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్’ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమాపై వివాదాలు ముసురుకున్నాయి. అబ్దుల్ కలాం, వ్యోమగామి రాకేష్ శర్మ బయోపిక్, రాజకీయ నేపథ్యంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కి సంబంధించిన బయోపిక్ కూడా రెడీ కాబోతుంది. తాజాగా ఈ విష‌యాన్ని క‌న్‌ఫాం చేశారు ప్ర‌ముఖ క్రిటిక్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్‌. మోదీ బ‌యోపిక్ ‘పీఎం న‌రేంద్ర‌మోదీ’ అనే టైటిల్‌తో తెర‌కెక్క‌నుండ‌గా ఈ సినిమా ఒమంగ్ కుమార్ తెర‌కెక్కించ‌నున్నార‌ట‌.


సందీప్ ఎస్ సింగ్ ఈ సినిమా నిర్మించ‌నున్నారు. అంతే కాదు జ‌న‌వ‌రి 7న ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల కానుంది. జ‌న‌వ‌రి మూడో వారం నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. మోదీ పాత్ర‌లో ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు వివేక్ ఒబేరాయ్ న‌టించ‌నున్నాడు. ఈ సినిమాకు సంబందించిన  ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ గ‌త ఏడాదిన్న‌ర నుండి జ‌రుగుతుంద‌ట‌. స్క్రిప్ట్‌, స్టోరీ, స్క్రీన్‌ప్లే త‌దిత‌ర అంశాల‌పై ఒమంగ్ కుమార్ టీం భారీ వ‌ర్క్ చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. 


మాములు దిగువ తరగతి కుటుంబంలో పుట్టి..రైల్వే స్టేషన్‌లో ‘టీ’ అమ్ముతూ బీజేపీలో అంచలంచెలుగా ఎదిగి ముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా...ఆపై దేశ ప్రధాన మంత్రిగా ఎదిగిన వైనం ఎందరికో ఆదర్శంగా నిలిచింది. గతంలో  ‘మేరీకోమ్’  మూవీకి ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. కాగా, జనరల్ ఎలెక్షన్స్  ముందు ఈ సినిమాతో మోదీపై కేంద్ర ప్రభుత్వంపై  పాజిటివ్ ఇంపాక్ట్  ఏర్పడేలా ఈ సినిమాను తెరకెక్కించే అవకాశాలున్నాయి.

IT’S OFFICIAL... Vivekanand Oberoi [Vivek Oberoi] to star in Narendra Modi biopic, titled #PMNarendraModi... Directed by Omung Kumar... Produced by Sandip Ssingh... First look poster will be launched on 7 Jan 2019... Filming starts mid-Jan 2019.

— taran adarsh (@taran_adarsh) January 4, 2019

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: