కమ్మోళ్లు మనుషులు కాదా..? పైనుంచి దిగొచ్చారా..?

Chakravarthi Kalyan
30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ కమేడియన్‌ గా పేరు తెచ్చుకున్న పృథ్వీ రాజకీయంగానూ చురుగ్గా ఉంటున్నారు. తాను వైఎస్సార్సీపీ అభిమానినని గతంలోనే ప్రకటించుకున్న నటుడు.. ఎన్నికల సమయంలో ప్రచారానికి కూడా వెళ్లానని చెప్పాడు. సినిమాల్లో బిజీగా ఉంటూనే రాజకీయాల్లోనూ పాల్గొంటానంటున్నాడు.



తాజాగా ఆయన సినీరంగంలోని కుమ్మ కులస్తులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సినీరంగంలో ఉండి ఇక్కడి బలమైన సామాజిక వర్గాన్ని ఎదుర్కోవడానికి సిద్దపడ్డారా అన్న ప్రశ్నకు .. సామాజిక వర్గం అంటూ ఎందుకు దాస్తారు.. కమ్మవాళ్లే కదా.. నేను ఇలాంటివి పట్టించుకోను. కమ్మవారు మాత్రం మనుషులు కాదా.. వారేమైనా దిగొచ్చారా.. అని వ్యాఖ్యానించారు.



చౌదరీలను ఎదుర్కోవడం అనే అంశం గురించి పట్టించుకోను. అలా అంటే.. నా మిత్రవర్గంలోనూ చాలా మంది కమ్మ స్నేహితులు ఉన్నారు. వాళ్లు మనుషులు కాదా.. అసలు చెప్పాలంటే అన్నీ బలమైన సామాజిక వర్గాలే.. ఏది కాదు.. అంటూ ఎదురు ప్రశ్నలు సంధించారు.



తాను కులాలకు, మతాలకు భయపడనంటున్నాడు పృధ్వీ.. వైఎస్సార్‌, జగన్‌ మాదిరిగా తనకు ఎవరికీ భయపడే మనస్తత్వం లేదన్నారు. తాను వైఎస్సార్‌ స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానని పృధ్వీ చెప్పారు. తనకు జీవించడానికి సరిపడా ఆస్తులున్నాయని.. ఇక జనం కోసం పని చేస్తానని పృధ్వీ అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: