కమెడీయన్ అలీ జీవితంలో అద్భుతం..?

Chakravarthi Kalyan
కమెడీయన్ అలీ గురించి తెలియనివారు ఉండరు. నిక్కర్లు వేసుకునే రోజుల నుంచి ఆయన సినీప్రస్థానం తెలుగువారి ముఖాల్లో నవ్వులు పూయించింది. సుదీర్ఘకాలం ఆయన హాస్యనటుడుగా అలరిస్తున్నారు. వెండితెరపైనే కాదు.. బుల్లి తెరపైనా ఆయన హాస్యవల్లరి కొనసాగుతూనే ఉంది.



అలాంటి అలీ జీవితంలో ఓ అద్భుతం జరిగిందట. ఈ విషయాన్ని ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆపదలో ఉన్నవారికి ఆదుకోవడం, ఆపన్నులకు సాయం చేయడం ఆలీకి అలవాటు. కానీ దాని గురించి ఆయన ఎప్పుడూ చెప్పుకోరట.



ఇలాంటి దాతృత్వ కార్యక్రమాల కోసం తన తండ్రి పేరిట రాజమండ్రిలో ఓ ఛారిటబుల్ ట్రస్టు కూడా ఏర్పాటు చేశాడట. ఆ సమయంలోనే తన జీవితంలో అద్భుతం జరిగిందంటారు అలీ. అలా తండ్రి పేరిట సేవా ట్రస్టు ఏర్పాటు చేసి నెల తిరగకుండానే తనకు కొడుకు జన్మించాడని ఆలీ మురిసిపోతుంటారు.



అందుకే మనం ఎవరికైనా సాయం చేస్తే.. దేవుడు మనకు సాయం చేస్తాడని తాను నమ్ముతానని అలీ అంటున్నారు. అలీ 1994లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆయనకు మొదట ఓ పాప, ఆ తర్వాత బాబు... మళ్లీ ఓ పాప జన్మించారు. అలీ ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరుకుందాం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: