సంక్రాంతి పండుగలో గాలిపటాలు ఎగరవేయడంలో ఆసక్తికర కారణాలు !

Seetha Sailaja
సంక్రాంతి అనగానే ఎవరికైనా వెంటనే గుర్తుకు వచ్చేది ముగ్గులు అదేవిధంగా గాలిపటాలు. ఆకాశాన్ని తాకాలని ప్రయత్నిస్తూ రంగురంగుల గాలిపటాలను ఎగరవేసే సాంప్రదాయం సంక్రాంతి పండుగలలో పల్లెల నుండి పట్టణ ప్రాంతాల వరకు ప్రతిచోటా కనిపిస్తూనే ఉంటుంది. 

ఈగాలి పటాలు ఎగురవేయడం వెనుక చాలా ఆశక్తికరమైన కారణం ఉంది. పూర్వకాలంలో గాలిపటాలను పగలే ఎగరవేయడంలో ఒక ఆరోగ్యపరమైన కారణం కూడ ఉంది. గాలిపటాలు ఎగరేసే టపుడు ఎక్కువ సమయం మన శరీరం సూర్యకిరణాలకు బహిర్గతం అవుతుంది కాబట్టి ఆరోగ్య రీత్యా ఇది చాల మంచి అలవాటు అనీ ఆయుర్వేద శాస్త్రంలో చెపుతారు. 

వాస్తవానికి ఈ గాలిపటాలు ఎవరవేసే సంస్కృతి పర్షియా ప్రాంతం నుండి మనదేశంలోకి కొన్ని వందల సంవత్సరాల క్రితం వచ్చిందని చరిత్రకారుల అభిప్రాయం. సంక్రాంతి పండుగ సందర్భంగా మన తెలుగు రాష్ట్రాలలో చాల చోట్ల గాలిపటాల పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. శీతాకాలంలో చలివల్ల వచ్చే అనేక ఇన్ఫెక్షన్లు అదేవిధంగా మన శరీరంలోని చెడు బ్యాక్టీరియాను తొలిగించడంలో ఈగాలి పటాలు ఎవరవేసే అలవాటు మనకు ఎంతో మంచి చేస్తుందని అంటారు. 

మార్కెట్ లో రెండు రూపాయల దగ్గర నుండి రెండు వందల రూపాయల వరకు లభించే అందమైన గాలిపటాలను ఎగరవేస్తూ అనందపడకుండా సంక్రాంతి సరదాలు పూర్తి కావు. చిన్న పిల్లలలో పట్టుదలతో పాటు ఉత్సాహాన్ని కూడ కలగచేసే ఈ గాలిపటాల పోటీలలో ఎదురుగాలులు వీస్తున్నప్పటికీ గెలవాలనే పట్టుదల కలిగించే ఈ గాలిపటాల సంక్రాంతి సందడి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: