మణిరత్నంతో వెంకటేశ్ ఛాన్స్ మిస్‌.. సినీజీవితంలో పెద్దలోటు..!?

Chakravarthi Kalyan
మణిరత్నం.. భారతదేశం గర్వించే దర్శకుల్లో ఒకరు. ఇందులో ఎలాంటి సంశయాలు లేవు. ఆయన పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చే సినిమాలు దళపతి, రోజా, బొంబాయి వంటి సినిమాలు కళ్ల ముందు మెదులుతాయి. ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలని హీరోలు కలలు కంటుంటారు.



మణిరత్నంతో పని చేసే అవకాశం దక్కించుకున్న తెలుగు హీరోలు చాలా తక్కువ. 1989లో మణిరత్నం నాగార్జునతో తెలుగులో గీతాంజలి సినిమా తీశారు. అది సూపర్‌ హిట్టైంది. ఆ తర్వాత ఆయన గాయం సినిమాకు మాత్రమే కథ అందించారు.



ఇక మనకు సూపర్ హిట్స్ గా పరిచయమైన మణిరత్నం తెలుగు సినిమాలన్నీ తెలుగులోకి డబ్బింగ్ అయిన సినిమాలే. ఐతే.. విక్టరీ వెంకటేశ్ కు కూడా మణిరత్నం దర్శకత్వంలో నటించే అవకాశం వచ్చిందట. అరవింద్‌ స్వామికి బ్రహ్మాండమైన హిట్‌ గా నిలిచిపోయిన రోజా సినిమా అసలు వెంకటేశ్‌ చేయాల్సినదేనట.



ఆ సమయంలో వెంకటేశ్ చేతికి గాయం అయ్యిందట. అందువల్ల ఆ సినిమా వెంకటేశ్‌ చేయలేకపోయారట. ఆ సినిమా చేసి ఉంటే.. హిందీవైపు వెళ్లి అక్కడే బిజీ అయిఉండేవాడినేమో అంటూ పాత జ్ఞాపకాన్ని నెమరువేసుకున్నారు వెంకటేశ్. మనం అనుకున్నవన్నీ జరగవని.. జరగని వాటి గురించి ఏమాత్రం బాధపడకూడదని వెంకటేశ్ అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: