అందాల శ్రీదేవిలా కన్ను కొట్టిన భామ ప్రియా ప్రకాశ్ !!

Satya
మలయాళీ భామ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ మరో మారు కుర్ర కారుని కవ్వించేందుకు రెడీ అయిపోతోంది.  హిందీ మూవీలో న‌టిస్తున్న‌ది.. ఈ మూవీ శ్రీ‌దేవి బంగ్లా పేరుతో తెర‌కెక్కిస్తున్నారు.. . ప్రశాంత్‌ మాంబుల్లి ఈ మూవీకి ద‌ర్శ‌కుడు.. తాజాగా ఈ మూవీ ట్రైల‌ర్ ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది 


ఈ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా  ఉండడంతో ఇపుడు ప్రియా ప్రకాశ్ మళ్ళీ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఒరు ఆదుర్ ల‌వ్ మూవీ ఇంకా విడుద‌ల కాకుండానే....  కన్ను కొట్టి కుర్రకారును తనవైపునకు తిప్పుకొన్న మలయాళీ భామ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ ఇపుడు ఈ హిందీ మూవీతో మొత్తం బాలీవుడ్ నే తిప్పుకునేలా ఉంది. 


శ్రీదేవి చిన్న పిల్లకి ఆటోగ్రాఫ్‌ ఇస్తున్న సన్నివేశంతో ప్రారంభ‌మైన ట్రైల‌ర్ లో . ‘మీకు ఇష్టమైన నటి ఎవరు’ అని ఆ చిన్నారి అడగ్గా.. ‘నాకు ఇష్టమైన నటి నేనే..’ అని ప్రియా అంటుంది..‘ఓ నటిగా నేను చాలా అదృష్టంతురాలిని. నాకు జీవితంలో దేవుడు అన్నీ ఇచ్చాడు. పేరు, డబ్బు, సంతోషం అన్నీ ఇచ్చాడు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా నాకు అభిమానులు ఉన్నారు. కానీ..’ అన్న డైలాగ్‌‌ వినిపిస్తుంది. 


మ‌రో కోణంలో ప్రియా ఓ పక్క ఏడుస్తూ మరోపక్క మద్యం తాగుతున్నట్లు ఉంది.. చివర్లో బాత్‌టబ్‌లో ఓ శవం కాళ్లు చూపించడంతో సస్సెన్స్ పెరిగిపోతున్న‌ది.. శ్రీ‌దేవి ప్ర‌మాద వ‌శాత్తు బాత్ ట‌బ్ లో మునిగి మ‌ర‌ణించిన సంద‌ర్భాన్ని ట్రైల‌ర్ లో క‌ట్ చేశారు మరి ఈ మూవీ ట్రైలర్ ఇలా ఆసక్తిని పెంచేలా ఉండడంతో ఇపుడు అందరి చూపు ఈ మూవీల నటించిన ప్రియ ప్రకాశ్ పైన పడింది. మరి ఈ మళయాళీ ముద్దు గుమ్మ మరెంతగా సంచలనం స్రుష్టిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: