లక్కీ ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేష్!

siri Madhukar
సినీ ఇండస్ట్రీలో కేవలం మూడు సంవత్సరాల కాలంలో చేసినవి కొన్ని సినిమాలే అయినా మళియాళ బ్యూటీ కీర్తి సురేష్ కి బాగా కలిసి వస్తుంది.  తెలుగులో నేను శైలజ, నేను లోకల్, మహానటి లాంటి సినిమాలతో బాగా పాపులారిటీ సంపాదించింది.  ఇక కోలీవుడ్ లో వరుస ఛాన్స్ లు దక్కించుకుంటున్న కీర్తి సురేష్ కి మరో అదృష్టం కలిసి వచ్చింది.   భాషతో సంబంధం లేకుండా అన్నిభాషలో సినిమాలు చేస్తుంది. తమిళంతో పాటు తెలుగులో కూడా స్టార్ హీరోయిన్ గా ఎదిగిన కీర్తి ‘మహానటి’ సినిమాతో అన్ని రంగాల వారికి తెలిసిపోయింది.

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటించేందుకు ‘మహానటి’ కీర్తి సురేశ్ చాన్స్ కొట్టేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఫాంటసీ సినిమాలో తలైవా సరసన కీర్తిసురేశ్ నటించనున్నట్టు కోలీవుడ్‌లో వార్తలు గుప్పుమన్నాయి. ‘పేట’ లాంటి డీసెంట్ హిట్ తరువాత రజనీ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. కొన్ని నెలల కిందట ఏఆర్ మురుగదాస్ రజనీకి ఈ సినిమా స్టోరీ చెబితే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తుంది. ప్రస్తుతం కీర్తి సురేశ్ ఓ మలయాళ సినిమాలో నటిస్తోంది.

 ఒక  రాజమౌళి రూపొందిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాలోనూ కీర్తిసురేశ్ నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.. కాకపోతే దీనిపై అఫిషియల్ గా ఎలాంటి వార్తలు రాలేదు. ఇటీవల తమిళంలో విశాల్ సరసన ‘పందెం కోడి, విజయ్ సరసన ‘సర్కార్’మూవీలో నటించిన కీర్తి సురేష్ అతి తక్కువ కాలంలో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.  ఈ నేపథ్యంలోనే రజినీ నటించబోయే కొత్త సినిమాలో ఆమెను తీసుకోవాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: