అజ్ఞాతంలోకి హాట్ బ్యూటీ రేష్మా?!
ఈ మద్య సినీ సెలబ్రెటీలకు సంబంధించిన కొన్ని పర్సనల్ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా మలయాళ పోర్న్ స్టార్ రేష్మ అకస్మాత్తుగా కనిపించకుండా పోవడంతో ఆమె చనిపోయిందంటూ వదంతులు వినిపిస్తున్నాయి. కాకపోతే దానికి సంబంధించిన విషయాలు.. ఆధారాలు ఏవీ లేకపోవడం ఇవన్నీ ఒట్టి రూమర్లు అంటూ కొట్టిపడేస్తున్నారు. అయితే ఆమె కనిపించకుండా పోవడం బహుషా..విదేశాలకు వెళ్లి పోయిందని మరికొంత మంది భావిస్తున్నారు. ఒకప్పుడు షకీలాతో సమానంగా మలయాళ సినీ పరిశ్రమను ఏలిన రేష్మ కొంత కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వస్తున్నారు.
మాలీవుడ్ లో షకిలా కూడా ఫోర్న్ స్టార్ అయినప్పటికీ తెలుగు,తమిళ చిత్ర పరిశ్రమలో మంచి అవకాశాలు రావడంతో ఆమె యూటర్న్ తీసుకున్నారు. అయితే రేష్మ కు మాత్రా ఆ ఛాన్సులు రాలేదు..అక్కడే కొన్ని బిగ్రేడ్ సినిమాలు తీస్తూ వచ్చింది. అప్పట్లో ఫోర్న్ తారగా నటించేందుకు ఒక్కో సినిమాకు ఏకంగా రూ. 5 లక్షలు డిమాండ్ చేసిన నటి అకస్మాత్తుగా అదృశ్యం కావడంపై మాలీవుడ్లో చర్చకు కారణమైంది. 2007 లో ఒక సెక్స్ రాకెట్ లో పట్టుబడ్డ రేష్మ తర్వాత బెయిల్ పై విడుదల అయ్యింది.
అప్పటి నుంచి ఆమె ఇండస్ట్రీకి దూరం కావడమే కాదు..అసలు ఎవరి కంటా పడకుండా ఉంటూ వచ్చింది. దాంతో ఆమె విదేశాలకు వెళ్లిందని కొంత మంది..లేదు చనిపోయి ఉండవొచ్చని మరికొంత మంది రక రకాలుగా పుకార్లు సృష్టిస్తున్నారు. తాజాగా ఈ విషయంపై నటి షకీలా స్పందిస్తూ..రేష్మ పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందని, మైసూరులో స్థిరపడిన ఆమెకు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారని చెప్పి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టింది. గతంలోని చేదు జ్ఞాపకాలను మర్చిపోయేందుకు ప్రయత్నిస్తోందని వివరించింది.