నారదుని అవతారమే రామ్ గోపాల్ వర్మ - హీరోల కొంపముంచేలా ఉన్నాడుగా!

లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో ఎన్టీఆర్ బయోపిక్ ను లక్ష్మి పార్వతి కోణంలో చూపటాని సిద్ధపడి తెలుగు సినిమా పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తున్న రామ్ గోపాల్ వర్మ, కేఏ పాల్‌ని గెలికి మరీ రెచ్చ గొట్టి తెలుగు ప్రజలకు ఏఫ్ 2 చిత్రాన్ని మించిన ఫన్‌ అండ్ ఫ్రస్ట్రేషన్‌ ని ఉప్పెనలా అందిస్తున్నారు. ఇదిలా ఉంటే, తాజాగా, రామ్ గోపాల్ వర్మ - యాక్షన్ హీరోలను హీరోయిన్ల తో పోల్చుతూ తనదైన శైలిలో ఒక ట్వీట్ వదిలారు.

కలహం లేకపోతే కలహభోజనుడికి కడుపెలా నిండుతుంది? తగవుల కోసం వెతుక్కునే,  "తగువు ఎలా వస్తుంది జంగం దేవరా! అంటే, బిచ్చం పెట్టవే బొచ్చు ముండా!" అన్నాడన్న అనూచానం గా వస్తున్న నానుడికి సరిగా అతికే వ్యతి వర్మ కావచ్చు! బహుశా రామ్ గోపాల్ వర్మ కూడా ఈ జాతికి చెందిన వాదేమో? ఆయన ఏం చేసినా ఏం మాట్లాడినా తగువు తప్పదు కదా! చివరికి ఎవర్నై నా పొగడాలన్నా తగువుని తవ్వి మరీ పొగిడేస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. 


లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సెగలు రేపుతున్న రామ్ గోపాల్ వర్మ చిత్రం - కేఏ పాల్‌ని గెలికి మరీ తెలుగు ప్రజలకు F2 చిత్రాన్ని మించిన ఫన్‌ అండ్ ఫ్రస్ట్రేషన్‌ ని అందిస్తు న్నారు. ఇదిలా ఉంటే తాజాగా మణికర్ణిక సినిమా విషయంలో రామ్ గోపాల్ వర్మ "మన యాక్షన్ హీరోలను హీరోయిన్లతో" పోల్చుతూ తన దైన శైలిలో ఒక  ట్వీట్ వదిలారు. ఇంతకీ ఆయన వాళ్లు వీళ్ల లాగా.. వీళ్లు వాళ్ల లాగ ఎందుకు కనిపించారంటే ‘మణికర్ణిక’ మూవీలో కథానాయిక పాత్రలో నటించిన కంగన రనౌత్ వలనే.  


కంగనా రనౌత్ లీడ్ రోల్‌ లో నటించిన ‘మణికర్ణిక’ మూవీ భారీ అంచనాల నడుమ జనవరి 25 విడుదలైంది. ఈ చిత్రం రామ్ గోపాల్ వర్మకి ఒక స్థాయిలో నచ్చేసిందట. దీంతో కంగనా రనౌత్‌ పై ప్రశంసల వర్షం కురిపిస్తూ.. ‘ఆమెలోని ఉగ్రరూపం, ధీరత్వం నన్నెంతో ముగ్దుణ్ణి చేశాయీ ఆమె ఇంటెన్సిటీ, పెర్ఫామెన్స్ నా మతి పోగొట్టేసింది. ఝాన్సీ లక్ష్మీభాయిగా కంగనా స్క్రీంపై చెలరేగిపోయారు. ఇలాంటి పెర్ఫామెన్స్ గతంలో బ్రూస్లీ నటించిన 'ఎంటర్ ది డ్రాగన్ ’ చిత్రంలో మాత్రమే చూశా! కంగనా నటనను చూస్తుంటే, తాజాగా యాక్షన్ హీరో లంతా నాకు హీరోయిన్లు గా కనిపిస్తున్నారు. నటనతో పోల్చుకుంటే వాళ్ల కంటే అసలైన యాక్షన్ హీరో కంగనే అన్నట్టుగా ఉంది’ అంటూ ట్వీట్ చేశారు రామ్ గోపాల్ వర్మ. 

ఇక ఈ చిత్రానికి క్రియేటివ్ దర్శకుడు క్రిష్ మేజర్ పోర్షన్ కి డైరెక్ట్ చేయగా, మిగలిపోయిన యాక్షన్ సన్నివేశాలకు, చిన్నా చితకా పాచ్ వర్క్ కు స్వయంగా కంగనా రనౌత్ డైరెక్ట్ చేయడం విశేషం. బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథను అందించారు. 

సినిమా నిర్మాణ సమయంలో వచ్చిన ఏవో మనస్పర్ధలతో కెప్టెన్ ఆఫ్ ది షిప్ జాగర్లమూడి క్రిష్ మిడిల్ ద్రాప్ అయిపోయాడు. ప్రముఖులు చెప్పే కారణం నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ బియోపిక్ దర్శకత్వం చేసే అవకాశం దొరకటం. ఇంకేం ఇక్కడ మైలేజ్ కోసం ఏదో సిల్లీ కారణం చూపి మణికర్ణిక సినిమా దర్శకత్వం వదిలేశాడట. కొత్త గర్ల్-ఫ్రెండ్ దొరికితే కట్టుకున్న పెళ్ళాన్ని వదిలేసినట్లు.  కాని ఇప్పుడు క్రెడిట్ కోసం పాకులాడుతున్న పరిస్థితుల్ని - రామ్ గోపాల్ వర్మ బాగానే వాడేశాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: