హీరోలపై వర్మ సంచలన వ్యాఖ్యలు!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు దర్శకులు రాంగోపాల్ వర్మ.  ప్రస్తుతం లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా నిర్మిస్తున్న ఆయన ఈ సినిమా ప్రమోషన్ వర్క్ లో ఎన్నో సంచలనాలు తెరపైకి తీసుకువస్తున్నారు.  ఇటీవల రెండు లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేయగా..ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.  అంతే కాదు తన ట్విట్టర్ అకౌంట్ లో రోజుకో ఫోటో రిలీజ్ చేస్తూ ఈ చిత్రంపై బూస్టింగ్ తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

తాజాగా రామ్‌గోపాల్ వర్మకు హీరోలంతా హీరోయిన్లుగా కనిపిస్తున్నారట. కంగనా రనౌత్ లీడ్ రోల్‌లో విడుదలైన ‘మణికర్ణిక’ చూశాక ఆయనకా ఫీలింగ్ కలిగిందట.  ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ‘‘మణికర్ణిక మూవీలో ఓ గ్రేట్ హీరో రూపంలో కంగనా రనౌత్ కనిపించింది. ఈ చిత్రంలో కంగనా చూపిన ఉగ్రరూపం, ధీరత్వం నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఈ చిత్రంలో ఆమె నటనతో పోల్చిచూస్తే.. యాక్షన్ హీరోలంతా నాకు హీరోయిన్లుగా కనిపిస్తున్నారు’’ అని ట్వీట్‌లో పేర్కొన్నాడు వర్మ. మరి దీనిపై స్టార్ హీరోల ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి. 
All action heroes look like heroines in comparison to the greatest hero I ever saw on screen #KanganaRanaut in #Manikarnika

— Ram Gopal Varma (@RGVzoomin) January 26, 2019

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: