సమంత ఒత్తిడితో దేవదాస్ గా మారబోతున్న చైతన్య !

Seetha Sailaja
నాగచైతన్య కెరియర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్నట్లుగా కొనాగుతూనే ఉంది. గత రెండేళ్ళ కాలంలో అతడు నటించిన ‘యుద్ధం శరణం’ ‘సవ్యసాచి’ లాంటి సినిమాలు ఘోరమైన ఫ్లాప్ లుగా మారితే ‘శైలజారెడ్డి అల్లుడు’ ఫ్లాప్‌ గా మారింది.

ఇలాంటి పరిస్థుతులలో ప్రస్తుతం అతడి ఆశలు అన్నీ సమంతతో కలిసి నటిస్తున్న ‘మజిలీ’ మీదే ఉన్నాయి. ‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో తీయబడుతున్న ఈమూవీ తనకు ఖచ్చితంగా హిట్ ఇస్తుందని చైతన్య నమ్ముతున్నాడు. ఈసినిమాను చేస్తూనే చైతూ త్వరలో తన మామయ్యా వెంకటేష్ తో కలిసి నటిస్తున్న ‘వెంకీ మామ’ షూటింగ్ ను మొదలు పెట్టబోతున్నాడు.

ఈపరిస్థుతుల నేపధ్యంలో సమంత ప్రోత్సాహంతో లెజెండరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ వ్రాసిన కథలో చైతన్య మోడ్రన్ దేవదాసుగా కనిపించబోతున్నట్లు సమాచారం. ఏఎన్నార్ ఆల్ టైం క్లాసిక్ ‘దేవదాసు’ స్ఫూర్తితో విజయేంద్ర ప్రసాద్ తీర్చిదిద్దిన లవ్ స్టోరీ ఇది అన్న ప్రచారం జరుగుతోంది. 

చైతన్య ఇప్పటి వరకు నటించిన సినిమాలలో ఎక్కువగా లవ్ స్టోరీలు బాగా సక్సస్ అవ్వడంతో అతడి బాడీ లాంగ్వేజ్ మాస్ యాక్షన్ సినిమాలకన్నా లవ్ స్టోరీలకు బాగా నప్పుతుందని సమంత అభిప్రాయం అని టాక్. దీనితో విజయేంద్ర ప్రసాద్ క్రియేట్ చేసిన ఈ మోడ్రన్ దేవదాస్ సినిమాను నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మింప చేయాలని కుదరకపోతే తానే సొంతంగా చైతన్యను మోడ్రన్ ‘దేవదాసు’ గా తన సొంత బ్యానర్ లో చూపించాలని సమంత గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి సమంత ఒత్తిడికి ఎంత వరకు చైతు నాగార్జనలు సహకరిస్తారో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: