తన చుట్టూ అల్లుకున్న అవినీతి పై పవన్ సంచలన వ్యాఖ్యలు !

Seetha Sailaja
ముఖ్యమంత్రి పదవి కోసం తాను రాజకీయాలలోకి రాలేదు అని తరుచూ చెప్పే పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యవస్థలో సమూలమైన మార్పులు రాకుండా జనం బాగుపడరు అంటూ అనేకసార్లు తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ ఉంటాడు. అలాంటి ‘జనసేన’ అధినేత రాజకీయాలలో పేరుకుపోతున్న అవినీతి పై సంచలన వ్యాఖ్యలు చేసాడు.

అవినీతి రహితమైన పాలన అందించాలి అంటే అవినీతిలేని వ్యక్తులు రాజకీయ పార్టీలలో ఉండాలని అయితే అలాంటి వ్యక్తులు ప్రస్తుతం ఎక్కడా కనిపించక పోవడంతో తన ‘జనసేన’ లో కూడ కొంతమంది అవినీతి పరులు చేరుతున్న విషయం వాస్తవమే అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. అంతేకాదు అవినీతి వ్యక్తులు లేని రాజకీయాలు ఎక్కడ ఉన్నాయి అంటూ ఎదురు ప్రశ్నలు వేస్తున్నాడు పవన్.

ఇలాంటి పరిస్థుతులలో కొందరు వ్యక్తులు అవినీతి పరులు అని తెలిసినా తాను వారిని ‘జనసేన’ లో చేర్చుకుంతున్నానని అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. అంతేకాదు తాను రాజకీయాలలో అవినీతి మచ్చాలేకుండా కొనసాగాలి అని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ తన చుట్టూ ఉన్న వ్యక్తులు అందరు అవినీతి రహితులు అని మాత్రం తాను చెప్పలేనని వారిని సమూలంగా మార్చాలి అంటే చాల సమయం పడుతుంది అంటూ మరొక షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు. 

బురదలో తామర పువ్వు ఉదయించినట్లుగా తాను ప్రస్తుతం రాజకీయాలలో పెరిగిపోయిన అవినీతి కుళ్ళులో ఉదయిస్తున్న తామరపువ్వులా ‘జనసేన’ ను తీర్చ్చి దిద్దాలని ప్రయత్నిస్తున్నానని అంటూ దానికి ప్రజల సహకారం కావాలి అని అంటున్నాడు. అయితే ఇలాంటి రాజకీయ కుళ్ళును కడిగివేయడానికి తనకు సమయం కావాలి అంటూ అవినీతి ప్రక్షాళన విషయమై కూడ పవన్ స్పష్టమైన క్లారిటీ ఇవ్వకుండా మాట్లాడుతున్న నేపధ్యంలో భావయుక్తంగా జనసేనాని మాట్లాడుతున్న మాటలు విని ఎందరు ఓట్లు వేస్తారు అన్నది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న..   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: