ఐటమ్‌ సాంగ్‌లోనే అంతా చూపిస్తుందట..?

Chakravarthi Kalyan
హీరోయిన్ల అంద చందాలు ఆరబోయాలన్నా.. శృంగార ప్రియులను అలరించాలన్నా ఐటమ్స్ సాంగ్స్ తప్పనిసరి. పాత సినిమాల్లో ఇలాంటి పాటల కోసం జ్యోతిలక్ష్మి, జయమాలిని, సిల్క్ స్మిత వంటి వారు ఉండేవారు. వారిని వ్యాంప్ కేరక్టర్లని పిలిచేవారు.



కానీ ఇప్పుడు హీరోయిన్లే ఆ లోటు భర్తీ చేస్తున్నారు. అంతే కాదు.. కేవలం ఒక్క పాట కోసం కూడా కొన్ని సినిమాలు ఒప్పుకుంటున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఇలాంటి ఐటమ్ సాంగ్స్ కొన్ని సినిమాల్లో చేసింది. అంతేకాదు.. తనకు ఐటమ్‌ సాంగ్స్ అంటే చాలా ఇష్టమని చెబుతోంది.



అందుకు ప్రత్యేకమైన కారణం కూడా చెబుతోంది తమన్నా.. తనకు గుర్తింపు తెచ్చింది తన డాన్సేనని తమన్నా నమ్మంక. మామూలుగా హీరోయిన్‌గా చేసే సమయంలో డాన్స్‌ టాలెంట్‌ చూపించే అవకాశం తక్కువగా ఉంటుందట. అదే ఐటెం సాంగ్‌ స్పెషల్‌ సాంగ్ప్‌లో అయితే నా డాన్స్‌ టాలెంట్‌ పూర్తిగా చూపించే అవకాశం దక్కుతుందట.



అందుకే తనకు ఐటమ్ సాంగ్స్ అంటే అంత ఇష్టమట. అలా అని పూర్తిగా వాటికే పరిమితం కానని కూడా అంటోంది. మంచి పాట అనిపిస్తే చేయడానికి ఎప్పుడూ వెనుకాడనదట ఈ ముద్దుగుమ్మ. అంటే నిర్మాతలకు తన టేస్ట్ ఏంటో ముందే చెప్పేస్తోందన్నమాట. అంతే కాదు.. ఈ పాటలకు ఎక్కువ సొమ్ము తీసుకోవడం కూడా ఏమాత్రం తప్పుకాదంటోంది. అవును మరి కష్టం ఎక్కువ ఉనప్పుడు ఆ మాత్రం తీసుకుంటే తప్పేం కాదుగా..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: