సాయి ధరమ్ తేజ్ డార్క్ సీక్రెట్ ను బయటపెట్టిన బ్రెజిలియన్ బ్యూటీ !

Seetha Sailaja
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సినిమా షూటింగ్ సమయాలలో చాల సరదాగా ఉండటమే కాకుండా అతడితో నటించే హీరోయిన్స్ తో రొమాంటిక్ జోక్స్ వేస్తూ తెగ నవ్విస్తూ ఉంటాడు. దీనికితోడు పబ్స్ కు వెళ్ళడంతో పాటు తనతో నటించే హీరోయిన్స్ ను తేజ్ పబ్స్ కు కూడ తీసుకువెళతాడు అన్న మాటలు కూడ ఉన్నాయి.

గతంలో రెజీనాతో ఈయంగ్ హీరో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆతరువాత వారిద్దరూ పెళ్ళి చేసుకుంటారు అనే స్థాయి వరకు వెళ్ళిన వాళ్ళ స్నేహం బ్రేకప్ వరకు వెళ్లిపోయింది. ఆతరువాత ఈయంగ్ హీరోకు వరస పరాజయాలు రావడంతో ఈ హీరో పై గాసిప్పులు తగ్గాయి.

అయితే అనూహ్యంగా తేజ్ తో ‘తిక్క’ సినిమాలో నటించిన బ్రెజిలియన్ బ్యూటీ లారిసా బోనాసీ తాను తేజ్ తో డేటింగ్ లో ఉన్నట్లుగా లీకులు ఇస్తూ ఇప్పుడు మెగా అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారింది. ‘తిక్క’ సినిమా ఫెయిల్ అయిన తరువాత ఆమెకు చెప్పుకోతగ్గ అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ లో సినిమాలు చేసుకుంటూ ఈమధ్య సందీప్ కిషన్ తమన్నాలు నటించిన ‘నెక్స్ట్ ఏంటి’ సినిమాలో నటించింది. అయితే ఆసినిమా కూడ ఆమెకు నిరాశను మిగిల్చింది. 

‘తిక్క’ సినిమా షూటింగ్ సమయంలో తేజ్ డేటింగ్ విషయంలో తన కోరికను ఈ బ్యూటీకి తెలియ చేస్తే ఆమె అప్పుడు తిరస్కరించింది అన్న వార్తలు వచ్చాయి. దీనికి కారణం అప్పట్లో ఆమెకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు అని సమాచారం. అయితే ఇప్పుడు ఆ స్నేహం మరిచిపోయి ప్రస్తుతం సినిమాలు లేక ఖాళీగా ఉన్న సాయి ధరమ్ తేజ్ తో స్నేహాన్ని కొనసాగిస్తూ తన ట్విటర్ లో సాయి ధరమ్ తేజ్ ను పూర్తిగా కనపడనీయకుండా తనతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ఇతడు ఎవరు ? అంటూ ప్రశ్నిస్తోంది. దీనితో తేజ్ ఈ బ్రెజిలియన్ బ్యూటీతో డేటింగ్ చేస్తున్నాడా అంటూ గాసిప్పుల హడావిడి కొనసాగుతోంది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: